Deers
-
పాకాల అడవిలో జింకలను వదిలిన అధికారులు
-
ఇదేందయ్యా ఇది! ఇలా కూడా కొట్లాడొచ్చా...
-
వైరల్: ఇదేందయ్యా ఇది! ఇలా కూడా కొట్లాడొచ్చా...
వాషింగ్టన్ : రెండు ఆడ జింకల విచిత్రమైన కొట్లాటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అమెరికా, టెక్సాస్‌లోని సోమర్ విల్లే లేక్‌లో చోటుచేసుకున్న ఈ ఫైట్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై జింకల యజమాని గే ఇస్బర్ మాట్లాడుతూ.. ‘‘ఆడ జింకలు కొట్లాడుకోవటం మొదటి సారి చూస్తున్నా.. అవి అచ్చం ఏలియన్స్లాగా కనిపించాయి. జింకలు మామూలుగా స్థలం కోసం గొడవపడుతూ ఉంటాయి’’ అని తెలిపింది. కొద్దిరోజుల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియోలో.. ఓ ఆడ జింక తన మానాన గడ్డి మేస్తోంది. ఇంతలో మరో ఆడ జింక అక్కడికి వచ్చింది. జింక బాషలో ఆ వచ్చిన ఆడ జింక ఏమందో ఏమో కానీ, దాన్ని చూడగానే గడ్డి మేస్తున్న జింక ఠక్కున రెండు కాళ్లపై? పైకి లేచింది. ఆ వెంటనే ఆ వచ్చిన జింక కూడా రెండు కాళ్లపై పైకి లేచింది. ముందు కాళ్లను ఊపుతూ ఒకటి వెనక్కు పోతుంటే.. రెండోది కూడా ముందు కాళ్లను గాల్లో ఊపుతూ దాని వెంట పడింది. కొన్ని అడుగుల దూరం పోయిన తర్వాత ముందు కాళ్లతో రెండూ కొన్ని సెకన్లు కొట్టుకున్నాయి. ఓ జింక కాళ్లకు బుద్ది చెప్పి అక్కడినుంచి పరుగులు తీసింది. రెండో జింక దాని వెంటపడింది. -
తిరుమలలో చిరుత కలకలం.. జింకల కోసం వెయిటింగ్
సాక్షి, తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల కిందట రెండో ఘాట్‌రోడ్డులో చిరుత రోడ్డును దాటుతుండగా భక్తులు సెల్ ఫోన్లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆదివారం మొదటి ఘాట్ రోడ్డులో చిరుత రోడ్డుకు పక్కనే ఉన్న చెట్టుకింద జింకల కోసం వేచి ఉంది. ఘాట్ రోడ్డులో వాహనాల్లో ప్రయాణిస్తున్న భక్తులు చిరుతను తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు. సాధారణంగా ఈ మార్గంలో భక్తులు రోడ్డు పక్కన ఉన్న జింకలకు ఆహారాన్ని అందిస్తుంటారు. అదే సమయంలో ఆహారం కోసం చిరుత ఘాట్ రోడ్డు పక్కకు వస్తోంది. తరచూ చిరుతలు ఇక్కడ కనిపిస్తుండడంతో భక్తులు భయపడిపోతున్నారు. -
లాక్డౌన్ వల్ల కలిగిన లాభం ఇదే..!
ముంబై: కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా మనుషులంతా ఇళ్లకే పరిమితయ్యారు. వాహనల రోద, కాలుష్యం తగ్గింది. దాంతో ప్రకృతి తనకు తానే చికిత్స చేసుకుంటూ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెటిజనులను తెగ ఆకట్టుకుంటోంది. ఉరుకులుపరుగులతో ఉండే ముంబై మహానగరంలో మనుషులు, వాహనాలు తప్ప జంతువులు మచ్చుకు కూడా కనిపింవు. ఒకవేళా కనిపించినా ఒకటి అరా తప్ప గుంపులుగా కనిపించడం అనేది అత్యంత అరుదు. ఈ క్రమంలో ముంబైలోని మిథి నది చుట్టుపక్కల ప్రాంతంలో తిరుగుతున్న జింకల గుంపుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ముంబైకి చెందిన న్యాయవాది, పర్యావరణవేత్త ఆఫ్రోజ్ ఈ వీడియోను షేర్ చేశారు. (ఆమెపై పెరిగిన వివక్ష) Positive effects of lockdown. Location - Mumbai city - Near River Mithi Starting point. Date /time - 2nd July evening . This is right in the heart of the mumbai city. Our cleanup of River Mithi started at this very spot. Leave mother nature alone. Mother nature revives. pic.twitter.com/SDS2RvdcWI — Afroz shah (@AfrozShah1) July 3, 2020 ఈ క్రమంలో ఆఫ్రోజ్ షా ‘లాక్డౌన్ వల్ల జరిగిన మేలు.. ముంబై మహానగరం మిథి నది పరిసర ప్రాంతాల్లో జూలై 2 సాయంత్రం ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. గతంలో మేం ఎక్కడైతే మిథి నది శుభ్రత కార్యక్రమం ప్రారంభించామో.. ఇప్పడు అక్కడే ఈ జింకల గుంపు స్వేచ్ఛగా విహరిస్తోంది. ప్రకృతి మాతను ఒంటరిగా వదిలేస్తే.. తనకు తానే చికిత్స చేసుకుంటుంది’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. లాయర్‌గా పని చేసిన ఆఫ్రోజ్ తొలుత 2015లో వెర్సొవా బీచ్‌ను శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలా కొద్ది కాలంలోనే వేలాది మంది వాలంటీర్లతో దేశంలోకెల్లా అతిపెద్ద కమ్యూనిటీ క్లీన్ అప్ డ్రైవ్ కార్యక్రమంగా మారింది. (తీపిగుర్తులు.. చేదు బతుకులు) -
అమెరికాను వణికిస్తున్న కొత్త వ్యాధి
అమెరికాను ఒక కొత్త వ్యాధి గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే జంతువుల నుంచి వ్యాప్తి చెందే అనేక అంటురోగాలతో అవస్థలు పడుతున్న అమెరికా ఇపుడు జింకలను చూస్తేనే భయపడిపోతోంది. వన్య మృగాలైన జింకలు, దుప్పిల్లో ఇటీవల విస్తృతంగా వ్యాప్తిస్తూ.. వాటి ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తున్న ‘జొంబీ డీర్’ వ్యాధిపై షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు అక్కడి వైద్య నిపుణులు. ‘జొంబీ డీర్’ (క్రానిక్ వాస్టింగ్ డిసీజ్, సీడబ్యుడీ) అని పిలిచే భయంకరమైన వ్యాధి (డెడ్లీ డిసీజ్) ఆనవాళ్లు ఇప్పటివరకూ జింక, దుప్పి జాతుల్లో మాత్రమే కనిపించాయి. కానీ ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందన్నది నిపుణుల తాజా హెచ్చరిక. ఇదే అగ్రరాజ్య ఆరోగ్య శాఖను పరుగులు పెట్టిస్తోంది. సీడబ్యుడీ వైరస్ సోకగానే..దాని లక్షణాలు వెంటనే బహిర్గతం కావు. శరీరం మొత్తంలో విస్తరించిన తర్వాత గానీ ఈ వ్యాధి సోకినట్లు అర్థంకాదు. దీంతో ఈ వ్యాధి తీవ్రత గురించి ఆందోళన పడాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని ఇలినాయిస్ సహా 24 రాష్ట్రాలతొపాటు, రెండుకెనడియన్ ప్రావిన్స్‌లో జొంబీ డీర్ వ్యాపించినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెబుతున్నారు. 1960లో కొలరాడోలో, అడవి జింకలో 1981లో మరోసారి గుర్తించామన్నారు. ప్రస్తుతానికి ఈ వ్యాధి మనుషులకు సోకిన కేసులను గుర్తించనప్పటికీ, మానవులకు సోకే ప్రమాదం లేకపోలేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. జొంబీ వైరస్ సోకగానే బరువుతగ్గిపోవడం, బాగా దప్పిక వేయడం, నోటినుంచి చొంగకారడం లాంటి సంకేతాలు కనిపిస్తాయట. ఇప్పటికే వేలకొద్దీ జింకల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి.అలాగే వీటి శారీరక ద్రవాలు మలం, లాలాజలం, రక్తం లేదా మూత్రంలో ఉన్న సీడబ్యూడీ వైరస్ ఎక్కువకాలం పర్యావరణంలో చురుకుగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇవి క్రమంగా మనుషులకు కూడా సోకుతాయని తేల్చారు. మరోవైపు దీని నివారణకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళనకు దారితీస్తోంది. -
ఎడారిలో అలరించిన జింకలు
-
జింకలున్నాయా...
♦ కంబాల కొండ, సీతకొండపై కానరాని సందడి ♦ హుద్‌హుద్ తుపాను తరువాత కనిపించని జాడ సాగర్‌నగర్ : విశాలమైన అటవీప్రాంతంగా పిలిచే కంబాలకొండ, సీతకొండ ప్రాంతాల్లో జింకల జాడ కానరావడం లేదు. ఒకప్పుడు వందల సంఖ్యలో జింకలు గుంపులుగా చెంగుచెంగున గెంతుతూ సందర్శకులను కనివిందు చేసేవి. పచ్చిక మేత కోసం జాతీయరహదారిపైకి వచ్చి వాహనచోదకులకు వినోదం కలిగించేవి. ఇప్పుడు ఆ గుంపులు కనిపించడం లేదు. జాతీయ రహదారిని ఆనుకుని పచ్చిక చిగుళ్లు కనిపిస్తున్నా జింకలు కానరావడం లేదు. ఆ జింకలు ఎమయ్యాయి..? అసలు అవి ఉన్నాయా..? హుద్‌హుద్ తుపాను సమయంలో మృతిచెందాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో డెయిరీఫారం నుంచి జూ పార్కు మీదుగా ఎండాడ వరకు గల జాతీయరహదారి ప్రాంతానికి పచ్చిక మేతకోసం సాయంత్రం, ఉదయం వేళల్లో జింకలు తరచూ వస్తుండేవి. మేత అనంతరం కంబాలకొండ కొలనులో నీళ్లు తాగి అడవులోకి పరుగుతీస్తుండేవి. అటవీప్రాంతం నుంచి ఆహారం కోసం వచ్చిన జింకలు జాతీయ రహదారిని దాటుతున్న సమయంలో వాహనాలు ఢీకొని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. సీతకొండల నుంచి జూ పార్కులోకి గుంపులుగా దిగిన జింకలు అడవి దున్నలు, కనుజులకు జూ సిబ్బంది వేసిన మేతను తిని మళ్లీ కొండలెక్కేస్తుండేవి. ఇవన్నీ హుద్‌హుద్ తుపానుకు ముందు పరిస్థితి. ఉంటే.. కనిపించేవి!: కొండల్లో జింకలు ఉన్నట్లయితే ఎప్పటిలాగే కనిపించేవి..హుద్‌హుద్ తుపాన్‌కు ముందు కంబాలకొండ చుట్టూ కొన్ని చోట్ల అటవీప్రాంతం నుంచి బయటకు రాకుండా కంచె నిర్మించారు. ఆ కంచె మధ్య ఖాళీలను దారులుగా చేసుకొని జింకలు బయటకు వచ్చేస్తుండేవి. తుపాను దాటికి కంబాలకొండ చుట్టూ ఉన్న కంచె పూర్తిగా మాయమైంది. ఇనుప తీగలు దెబ్బతినడంతో కొండచుట్టూ రక్షణ కవచం లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో జింకలు బయటకు రాకపోవడంతో అసలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నలు జంతు ప్రేమికుల్లో తలెత్తుతున్నాయి.