అమెరికాను ఒక కొత్త వ్యాధి గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే జంతువుల నుంచి వ్యాప్తి చెందే అనేక అంటురోగాలతో అవస్థలు పడుతున్న అమెరికా ఇపుడు జింకలను చూస్తేనే భయపడిపోతోంది. వన్య మృగాలైన జింకలు, దుప్పిల్లో ఇటీవల విస్తృతంగా వ్యాప్తిస్తూ.. వాటి ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తున్న ‘జొంబీ డీర్’ వ్యాధిపై షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు అక్కడి వైద్య నిపుణులు.
‘జొంబీ డీర్’ (క్రానిక్ వాస్టింగ్ డిసీజ్, సీడబ్యుడీ) అని పిలిచే భయంకరమైన వ్యాధి (డెడ్లీ డిసీజ్) ఆనవాళ్లు ఇప్పటివరకూ జింక, దుప్పి జాతుల్లో మాత్రమే కనిపించాయి. కానీ ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందన్నది నిపుణుల తాజా హెచ్చరిక. ఇదే అగ్రరాజ్య ఆరోగ్య శాఖను పరుగులు పెట్టిస్తోంది.
సీడబ్యుడీ వైరస్ సోకగానే..దాని లక్షణాలు వెంటనే బహిర‍్గతం కావు. శరీరం మొత్తంలో విస్తరించిన తర్వాత గానీ ఈ వ్యాధి సోకినట్లు అర్థంకాదు. దీంతో ఈ వ్యాధి తీవ్రత గురించి ఆందోళన పడాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని ఇలినాయిస్ సహా 24 రాష్ట్రాలతొపాటు, రెండుకెనడియన్ ప్రావిన్స్‌లో జొంబీ డీర్ వ్యాపించినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెబుతున్నారు. 1960లో కొలరాడోలో, అడవి జింకలో 1981లో మరోసారి గుర్తించామన్నారు. ప్రస్తుతానికి ఈ వ్యాధి మనుషులకు సోకిన కేసులను గుర్తించనప్పటికీ, మానవులకు సోకే ప్రమాదం లేకపోలేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు.
జొంబీ వైరస్ సోకగానే బరువుతగ్గిపోవడం, బాగా దప్పిక వేయడం, నోటినుంచి చొంగకారడం లాంటి సంకేతాలు కనిపిస్తాయట. ఇప్పటికే వేలకొద్దీ జింకల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి.అలాగే వీటి శారీరక ద్రవాలు మలం, లాలాజలం, రక్తం లేదా మూత్రంలో ఉన్న సీడబ్యూడీ వైరస్ ఎక్కువకాలం పర్యావరణంలో చురుకుగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇవి క్రమంగా మనుషులకు కూడా సోకుతాయని తేల్చారు. మరోవైపు దీని నివారణకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళనకు దారితీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment