నేహా దేశ్‌పాండే, కార్తీక్ సాయి
కార్తీక్ సాయి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సైకో’. అటు హీరోగా, ఇటు డైరెక్టర్‌గా ఇదే ఆయనకు తొలి చిత్రం. లావణ్య సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఆవుల రాజు యాదవ్, వాసు సంకినేని నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఓ కొత్త పాయింట్‌కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు చిత్రీకరిస్తున్న విధానం బాగుంది. మా చిత్రం సమాజానికి ఓ కొత్త సందేశం ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా చిత్రానికి కథ, కథనమే ప్రధాన బలం’’ అన్నారు కార్తీక్ సాయి. డాలి షా, నేహా దేశ్‌పాండే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్యన్, సంగీతం: సిద్దార్ వాట్కిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్, లైన్ ప్రొడ్యూసర్స్: ప్రియా, సంతోష్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment