Neha Deshpande
-
డ్రగ్స్ కేసులో హీరోయిన్ నేహా దేశ్‌పాండే భర్త మైరాన్ మోహిత్ అరెస్ట్
-
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ భర్త అరెస్ట్
టాలీవుడ్‌కు చెందిన చెందిన ప్రముఖ హీరోయిన్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నటి నేహా దేశ్ పాండే భర్తను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్‌గా నేహా దేశ్‌పాండే భర్త మైరాన్ మోహిత్ కొనసాగుతున్నారు. హైదరాబాద్‌తో పాటు గోవా, ముంబై నగరాల్లో డ్రగ్స్ సరఫరా చేసేవారితో మోహిత్‌కు పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు వందకు పైగా డీజేలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడని తెలుస్తోంది. గోవాతో పాటు దేశంలోని పలు నగరాల్లో డీజేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ముంబైకి మోహిత్ వెళ్లినట్లు సమాచారం. పబ్‌ల్లో వెయిటర్‌గా పని చేస్తూ డ్రగ్ సప్లయర్‌గా మారినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ది కిల్లర్, దిల్ దివాన్, బెల్స్ బాలీవుడ్ సినిమాల్లో నేహా దేశ్‌పాండే నటించింది. -
సైకో సందేశం
కార్తీక్ సాయి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సైకో’. అటు హీరోగా, ఇటు డైరెక్టర్‌గా ఇదే ఆయనకు తొలి చిత్రం. లావణ్య సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఆవుల రాజు యాదవ్, వాసు సంకినేని నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఓ కొత్త పాయింట్‌కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు చిత్రీకరిస్తున్న విధానం బాగుంది. మా చిత్రం సమాజానికి ఓ కొత్త సందేశం ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా చిత్రానికి కథ, కథనమే ప్రధాన బలం’’ అన్నారు కార్తీక్ సాయి. డాలి షా, నేహా దేశ్‌పాండే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్యన్, సంగీతం: సిద్దార్ వాట్కిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్, లైన్ ప్రొడ్యూసర్స్: ప్రియా, సంతోష్ కుమార్. -
బిచ్చగాళ్లు లేని సమాజాన్ని చూడాలి
అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే జంటగా కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘బ్రేకప్ లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఎస్.ఎ. రెహమాన్ సమర్పణలో బి. చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఓ యువకుడు సాగించిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అది తన ప్రేమకథను ఎలా ప్రభావితం చేసింది అన్నదే ఈ చిత్ర కథాంశం. హైదరాబాద్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా చేయాలని ప్రభుత్వం తలపెట్టిన యజ్ఞానికి బాసటగా నిలిచే చిత్రమిది. అనాథ అయిన అర్జున్ బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి. శ్రీవెంకట్ పాటలకు చక్కని స్పందన వచ్చింది. చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ‘లవ్ ఈజ్ బ్లైండ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. 70 శాతం పూర్తయింది’’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరరావు కథ చెప్పగానే విభిన్నంగా ఉందనిపించింది. సుమన్ ఓ వెరైటీ పాత్ర చేయగలడు అని ఈ సినిమాతో పేరొస్తుంది. మంచి విలన్ పాత్రలు ఇస్తే చేయడానికి రెడీ. నేటి జనరేషన్లో రాజమౌళి మాత్రం విలన్ని ఎంతో గొప్పగా చూపిస్తున్నారు. ‘బాహుబలి’లో హీరో ప్రభాస్ కాదు.. రానా. ఆయన పాత్ర అంత బాగుంది’’ అన్నారు. -
బ్రేకప్ లవ్‌స్టోరీ
అర్జున్ రెడ్డి, నేహాదేశ్ పాండే జంటగా కేఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘ఏ బ్రేకప్ లవ్‌స్టోరీ’ అనేది ఉప శీర్షిక. ఎస్.ఏ. రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై బి. చంద్రశేఖర్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. రిలీజ్ తర్వాత ఇందులోని మెసేజ్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇలాంటి వినోదాత్మక చిత్రాలను కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు ప్రోత్సహించాలి’’ అన్నారు. ‘‘వినాయక్ వంటి దర్శకులు మా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి మెచ్చుకోవడం గర్వంగా ఉంది. ‘కష్టపడి జీవితంలో పైకి వచ్చేవాడు లక్కీ ఫెలో. ఇతరుల కష్టంతో ఓసీగా బతుకుతూ పేదవాడిగా, బిచ్చవాడిగా జీవించేవాడు అన్ లక్కీఫెలో’ అనే ఫిలాసఫీ ఆధారంగా సినిమాను తెరకెక్కించాం. సెన్సార్ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం’’ అని బి. చంద్రశేఖర్‌రావు అన్నారు. -
సందేశాత్మక కథతో ‘అనువంశికత’
కౌండిన్య మూవీస్ పతాకంపై నటుడు, నిర్మాత తాళ్లపల్లి దామోదర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అనువంశికత’. సంతోష్ రాజ్, నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రమేష్ ముక్కెర దర్శకుడు. ఈ నెల 24న రిలీజ్‌కానున్న ఈ చిత్ర టైలర్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరకొండ మధుసూదనాచారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా.. సందేశాత్మక చిత్రం తీసి రిలీజ్ చేయటం మామూలు విషయం కాదన్న మధుసూదనా చారి.. ఎంతో పట్టుదలగా సినిమాను పూర్తి చేసిన చిత్రయూనిట్‌ను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సుమన్ పైరసీ కారణంగా సినీ రంగం చాలా ఇబ్బంది పడుతుందని, ఇటీవల పలు చిత్రాల్లోని సన్నివేశాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో బయటకు రావటం బాధాకారమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ... ‘నిర్మాత దాము గారు నాకు ఇష్టమైన వ్యక్తి. మేనరికాల వల్ల అంగవైకల్యంతో ఉండే పిల్లలు పుడతారు. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవలసి వస్తుందన్న అంశంతో పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ సినిమా రూపొందింది. దర్శకుడు చాలా బాగా డీల్ చేశారు. పాటలు కూడా బాగా కుదిరాయి. ఇలాంటి సినిమాకు ప్రభుత్వం పన్ను రాయితీ కల్పిస్తే బావుంటుంది. ఈ సినిమాను చదలవాడ శ్రీనివాసరావు గారు రిలీజ్ చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంద’న్నారు. -
బిచ్చగాళ్లు లేని సమాజం కోసం...
‘‘నిర్మాత చంద్రశేఖర్ అన్నీ తానే అయి కె.ఎస్.నాగేశ్వర రావు నుంచి చాలా మంచి ఔట్పుట్ తీసుకున్నారు. భవిష్యత్‌లో తను చాలా పెద్ద నిర్మాత అవుతాడు. శ్రీ వెంకట్ మ్యూజిక్ చాలా బాగుంది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ‘బిచ్చగాడా మజాకా’ సినిమా మంచి హిట్ అవుతుంది’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే జంటగా కె.ఎస్.నాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘ఎ బ్రేకప్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మించారు. శ్రీవెంకట్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడంతోపాటు, టైటిల్ సాంగ్ ఆలపించిన బాబూమోహన్ విడుదల చేశారు. కె.ఎస్.నాగేశ్వర రావు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాగా రిలీజ్ అవుతోన్న మా ‘బిచ్చగాడా మజాకా’ విడుదల తర్వాత పెద్ద సినిమా అవుతుంది. బాబూమోహన్గారి సహాయ సహకారాలు మరువలేనివి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’అన్నారు. ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఒక యువకుడు చేసిన పోరాటం ఎటువంటి మలుపులు తిరిగింది? అది అతని ప్రేమకథను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కథాంశంతో రూపొందించాం’’ అన్నారు బి.చంద్రశేఖర్. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే, శ్రీ వెంకట్, కెమెరామెన్ అడుసుమిల్లి విజయ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.ఎం.బాషా, లైన్ ప్రొడ్యూసర్ తేజా రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎస్.ఏ.రెహమాన్. -
ఉదయం ఆట ఉచితం
‘‘దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన నేను ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’ వంటి మంచి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతుండడం గర్వంగా ఉంది. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలను కొందరు మహిళలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే అంశం ఆధారంగా రూపొందిన సందేశభరిత వినోదాత్మక చిత్రమిది’’ అని దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ అన్నారు. శరత్ చంద్ర, నేహా దేశ్‌పాండే జంటగా ఆమని ముఖ్య పాత్రలో రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించిన ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’ రేపు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాని విడుదల రోజు ఉదయం ఆటను అందరికీ ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ మినహా మా చిత్రం ఆడుతున్న అన్ని థియేటర్స్‌లో ఇది వర్తిస్తుంది. సినిమాపై నమ్మకంతో పాటు చూసిన ప్రతి ఒక్కరూ పదిమందికి చెబుతారనే ఆలోచనతో సాంబశివరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమనిగారి పాత్ర హైలైట్. మా సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. -
విడుదల రోజు ఉదయం ఆట ఉచితం!
శరత్ చంద్ర, నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా.. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘ఐపిసి సెక్షన్ భార్యాబంధు’ ఆలూరి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి ఆమని ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. రిలీజ్ సందర్భంగా చిత్రయూనిట్ విడుదల రోజు ఉదయం ఆటను అందరికీ ఉచితంగా ప్రదర్శించేందుకు నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీ ప్లెక్స్ మినహా ఈ చిత్రం విడుదలవుతున్న అన్ని థియేటర్స్ (సింగిల్ స్క్రీన్స్)లో తొలి షోను ఉచితంగా ప్రదర్శించనున్నారు. దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. సినిమాపై నమ్మకంతో నిర్మాత ఆలూరి సాంబశివరావు ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారని.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పదిమందికి చెబుతారనే నమ్మకంతో ఈ ఆఫర్ ఇస్తున్నామని దర్శకుడు తెలిపారు. -
భర్తలకు సెక్షన్ ఏది?
ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’. శరత్చంద్ర, నేహా దేశ్‌పాండే జంటగా రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. శరత్చంద్ర మాట్లాడుతూ – ‘‘చిన్నప్పటినుంచి హీరో కావాలనుకునేవాణ్ణి. కొన్ని సినిమా షూటింగులు చూసిన తర్వాత సినిమాలంటే ఆసక్తి తగ్గింది. అమ్మా,నాన్నల ఒత్తిడితో అక్కినేని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాను. కోర్సు పూర్తయ్యాక ఏం చేస్తావని మా గురువుగారు అడిగితే ఇంటికెళ్తాను అని చెప్పాను. ఆయన నా ధృక్పథాన్ని మార్చారు. ఆ తర్వాత ‘ఐపీసీ సెక్షన్ భార్య బంధు’ చేసే అవకాశం వచ్చింది. ఇందులో న్యాయవాదిగా కనిపిస్తా. మన దేశంలో మహిళలు, వృద్ధులు, చిన్నారులకు అండగా కొన్ని చట్టాలు, సెక్షన్లు ఉన్నాయి. కానీ భార్యల వల్ల కష్టాలు పడే భర్తల కోసం ఒక్క చట్టం కూడా లేదు. ‘ఇండియన్ పీనల్ కోడ్‌లో’ ఓ కీలకమైన సెక్షన్ ‘ఇల్లాలి పీనల్ కోడ్’గా మారడంతో ఎంతోమంది మగాళ్లు కష్టాలు పడుతున్నారు. పెళ్లయిన మగాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ విషయాన్నే మా సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘సంప్రదాయమైన అమ్మాయిగా, వెస్ట్రన్ డ్యాన్సర్‌గా రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేశాను. కథతో పాటు నా పాత్ర ట్రావెల్ అవుతుంది’’ అన్నారు నేహా దేశ్‌పాండే. -
మిస్సయిపోతానేమోనని ‘యస్’ చెప్పా
‘‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’లో ఓ ఇంపార్టెంట్ రోల్‌కి అడిగినప్పుడు చేయాలా? వద్దా? అనుకున్నా. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తున్నాను. ఈ సినిమాలో కొత్త హీరో. అయితే కథ విన్నాక ఒకవేళ చేయనని చెబితే మంచి సినిమా మిస్సయినట్లే అనిపించింది. అందుకే యస్ చెప్పా’’ అన్నారు ఆమని. ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’ తదితర చిత్రాల్లో కథానాయికగా మంచి స్థానం సంపాదించుకున్న ఆమని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కీలక పాత్రలు చేస్తున్న విఫయం తెలిసిందే. శరత్ చంద్ర, నేహా దేశ్ పాండే జంటగా రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మించిన ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’లో ఆమె ఓ కీలక పాత్ర చేశారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఆమని మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నేను స్వాతీ శ్రీపాద అనే రైటర్ కమ్ కౌన్సిలర్‌గా చేశాను. ఇందులో నాకు పెళ్లి నేపథ్యంలో వచ్చే ఓ పాట కూడా ఉంది. ఇప్పటివరకూ వచ్చిన పెళ్లి పాటల్లో టాప్ టెన్‌లో ఈ పాట కూడా ఉంటుంది. వివాహ బంధం గొప్పతనం తెలియక చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. ఆ నేపథ్యంలో చక్కని సందేశం, మంచి వినోదంతో రెట్టడి శ్రీనివాస్ ఈ సినిమా తీశారు. ఎంతో ప్యాషన్‌తో ఆలూరి సాంబశివరావుగారు ఈ సినిమా నిర్మించారు. హీరో శరత్ చంద్రకు మంచి భవిష్యత్ ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
మగవాళ్లను రక్షించండి
ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఓ ముఖ్యమైన సెక్షన్ ఆధారంగా రూపొందిన కుటుంబ కథా చిత్రం ‘ఐపీసీ సెక్షన్.. భార్యాబంధు’. ‘సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్’ అన్నది స్లోగన్. శరశ్చంద్ర, నేహా దేశ్‌పాండే జంటగా ఆమని ముఖ్య పాత్ర చేస్తున్నారు. రెట్టడి శ్రీనివాస్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి), ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ ముత్యాల రాందాసు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ– ‘‘కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఒక సున్నితమైన అంశానికి సునిశిత హాస్యాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో సినిమా రిలీజ్ చేస్తాం. విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చర్చించిన అంశం గురించి మాట్లాడుకుంటారు’ అన్నారు ఆలూరి సాంబశివరావు. ‘‘నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చి, మంచి సినిమా తీసేలా ప్రోత్సహించిన సాంబశివరావుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు రెట్టడి శ్రీనివాస్. సంగీత దర్శకుడు విజయ్ కురాకుల, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.శ్యామ్. -
టైటిల్ క్యాచీగా ఉంది – ఎన్.శంకర్
‘‘మనం తరచుగా వాడే పదం ‘వాడేనా’ని టైటిల్‌గా పెట్టడం క్యాచీగా ఉంది. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్, ఆర్.ఆర్ బాగున్నాయి. టైటిల్ ఇంట్రెస్ట్‌గా ఉంటే సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతుంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని దర్శకుడు ఎన్. శంకర్ అన్నారు. శివ తాండేల్, నేహా దేశ్‌పాండే జంటగా సాయిసునీల్ నిమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వాడేనా’. ఓం సాయిరామ్ సమర్పణలో మణిపాల్ మచ్చి అండ్ సన్స్ నిర్మిస్తున్నారు. కిరణ్ వెన్న స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఎన్.శంకర్ విడుదల చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి ట్రైలర్ ఆవిష్కరించారు. సాయిసునీల్ నిమ్మల మాట్లాడుతూ– ‘‘ఎన్.శంకర్‌గారిని చూసి ఇన్స్పైర్ అయ్యా. రాజ్ కందుకూరిగారి ‘పెళ్ళి చూపులు‘ సినిమాను 22 సార్లు చూసి ఎంతో నేర్చుకున్నా. అందుకే వీరిద్దరినీ ఈ వేడుకకు పిలిచాం. నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయలేదు. సినిమాలు చూసి, చాలామందిని స్ఫూర్తిగా తీసుకుని ‘వాడేనా’ చేశా. నేను దర్శకత్వం వహించడంతో పాటు 4పాటలు రాశా. కొరియోగ్రఫీ కూడా చే శా. మంచి విషయం ఉన్న చిత్రంగా నిలిచిపోతుంది’’ అన్నారు. నిర్మాతలు ధృవ్, మణిపాల్ మచ్చి, శివ తాండేల్, నేహా దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.ఆర్. వెంకట్. -
హంతకుడు వాడేనా?
శివ్ తాండేల్, నేహా దేశ్‌పాండే జంటగా సాయిసునీల్ నిమ్మల దర్శకత్వంలో మణిలాల్ మచ్చి అండ్ సన్స్ నిర్మిస్తున్న సినిమా ‘వాడేనా’. సోమవారం ఈ సినిమా టీజర్‌ను రాజ్ కందుకూరి, ఫస్ట్ లుక్, చిత్రనిర్మాణ సంస్థ లోగోలను నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, మల్కాపురం శివకుమార్‌లు రిలీజ్ చేశారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘కథ బాగుంటే చిన్న సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తాయని ‘పెళ్లి చూపులు, సైరత్, అర్జున్‌రెడ్డి’లతో పాటు పలు సినిమాలు నిరూపించాయి. ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టు మంచి కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమకథకు యాక్షన్, థ్రిల్లర్ అంశాలను మేళవించి, రూపొందించిన చిత్రమిది. ఓ నగరంలో వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్‌ను ఓ యువకుడు ఎలా పట్టుకున్నాడనేది చిత్రకథ’’ అన్నారు. చిత్రనిర్మాత మణిలాల్, హీరో హీరోయిన్లు శివ్, నేహా దేశ్‌పాండే పాల్గొన్నారు. -
సిల్క్ ఇండియా ఎక్స్పోను ప్రారంభించిన నటి నేహా పాండే
-
వజ్రాలు కావాలా!
అనిల్ బూరగాని, నేహా దేశ్‌పాండే, నిఖితా బిస్థ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ ‘వజ్రాలు కావాలా నాయనా’. పి. రాధాకృష్ణ దర్శకత్వంలో శ్రీపాద ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై కిషోర్ కుమార్ కోట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమా రంగంలోకి వచ్చా. అందులో భాగంగా కొందరు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాం. నా కథకు దర్శకుడు పూర్తి న్యాయం చేశాడు. మంచి లొకేషన్స్ లో, భారీ సాంకేతిక విలువలతో రిచ్‌గా నిర్మించా. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుంది. జాన్ పొట్ల స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. మా చిత్రం పూర్తి వినోదంగా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించడంతో సినిమాపై నమ్మకం మరింత పెరిగింది’’ అన్నారు. విజయ్ సాయి, చిట్టిబాబు, శివ, అశ్విని, కుందన నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.అమర్ కుమార్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: శివప్రసాద్ . -
సమాజ శ్రేయస్సు కోసం...
అన్యాయాలను ఎదిరించి, సమాజ శ్రేయస్సు కోసం యువతరం ఏం చేశారనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ది బెల్స్’. రాహుల్, నేహా దేశ్‌పాండే జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ వాల్‌పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మూడు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈ నెల 5న చిత్రీకరణ మొదలుపెట్టి 16 లోపు ఈ మూడు పాటల చిత్రీకరణ పూర్తి చేస్తాం. కాసర్ల శ్యామ్ చక్కని స్వరాలందించారు. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
దిల్ దీవాన ప్రెస్ మీట్
-
ఎమోషనల్‌గా దిల్ దివానా
శేఖర్ కమ్ముల దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేసిన తుమ్మ కిరణ్ దర్శకునిగా మారారు. ఆయన దర్శకత్వంలో శ్రీ భావనా ఫిల్మ్స్ పతాకంపై రాజారెడ్డి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘దిల్ దివానా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా రాజ్ అర్జున్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, అభా సింఘల్, నేహా దేశ్‌పాండే హీరో హీరోయిన్లుగా, రామ్‌నారాయణ్ సంగీతదర్శకునిగా పరిచయమవుతున్నారు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా తుమ్మ కిరణ్ మాట్లాడుతూ -‘‘సున్నితమైన ప్రేమకథతో ఈ చిత్రం చేస్తున్నాం. ఎమోషనల్ డ్రామాతో సాగే మంచి ఫీల్ ఉన్న సినిమా. హీరో హీరోయిన్లు కొత్తవారైనా చక్కగా నటించారు. నాగబాబుగారు చేసిన పాత్ర చాలా బాగుంటుంది. వేణు, ధనరాజ్, రాఘవ చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. మిగిలిన రెండు పాటలను ఈ నెలలో పూర్తి చేసి, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ఎన్. నారాయణబాబు, కెమెరా: జైపాల్‌రెడ్డి, ఆర్ట్: ఉపేందర్‌రెడ్డి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్.