ఎమోషనల్‌గా దిల్ దివానా
శేఖర్ కమ్ముల దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేసిన తుమ్మ కిరణ్ దర్శకునిగా మారారు. ఆయన దర్శకత్వంలో శ్రీ భావనా ఫిల్మ్స్ పతాకంపై రాజారెడ్డి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘దిల్ దివానా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా రాజ్ అర్జున్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, అభా సింఘల్, నేహా దేశ్‌పాండే హీరో హీరోయిన్లుగా, రామ్‌నారాయణ్ సంగీతదర్శకునిగా పరిచయమవుతున్నారు.
రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా తుమ్మ కిరణ్ మాట్లాడుతూ -‘‘సున్నితమైన ప్రేమకథతో ఈ చిత్రం చేస్తున్నాం. ఎమోషనల్ డ్రామాతో సాగే మంచి ఫీల్ ఉన్న సినిమా. హీరో హీరోయిన్లు కొత్తవారైనా చక్కగా నటించారు. నాగబాబుగారు చేసిన పాత్ర చాలా బాగుంటుంది.
వేణు, ధనరాజ్, రాఘవ చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. మిగిలిన రెండు పాటలను ఈ నెలలో పూర్తి చేసి, డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ఎన్. నారాయణబాబు, కెమెరా: జైపాల్‌రెడ్డి, ఆర్ట్: ఉపేందర్‌రెడ్డి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్.