
టాలీవుడ్‌కు చెందిన చెందిన ప్రముఖ హీరోయిన్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నటి నేహా దేశ్ పాండే భర్తను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్‌గా నేహా దేశ్‌పాండే భర్త మైరాన్ మోహిత్ కొనసాగుతున్నారు. హైదరాబాద్‌తో పాటు గోవా, ముంబై నగరాల్లో డ్రగ్స్ సరఫరా చేసేవారితో మోహిత్‌కు పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.
దాదాపు వందకు పైగా డీజేలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడని తెలుస్తోంది. గోవాతో పాటు దేశంలోని పలు నగరాల్లో డీజేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ముంబైకి మోహిత్ వెళ్లినట్లు సమాచారం. పబ్‌ల్లో వెయిటర్‌గా పని చేస్తూ డ్రగ్ సప్లయర్‌గా మారినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ది కిల్లర్, దిల్ దివాన్, బెల్స్ బాలీవుడ్ సినిమాల్లో నేహా దేశ్‌పాండే నటించింది.
Comments
Please login to add a commentAdd a comment