mohit
-
లోకల్ లైగర్.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడలో సిటీ కుర్రాడి సత్తా !
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) క్రీడలో హైదరాబాద్ సిటీ కుర్రాడు సత్తా చాటుతున్నాడు. ప్రత్యర్థులపై పంచ్‌లతో రెచ్చిపోతున్నాడు. ఓవైపు బీటెక్ చదువును కొనసాగిస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ క్రీడల్లో రాణిస్తున్నాడు. అతడే మోహిత్. ఇప్పటికే ఏకంగా ఏడు బంగారు పతకాలు కైవసమయ్యాయంటే అతని పంచ్ పవరేంటో అర్థం చేసుకోవచ్చు. తైక్వాండో నుంచి ఎంఎంఏ.. ఫిర్జాదిగూడలోని మేడిపల్లి ఏవీ ఇన్ఫో ప్రైడ్‌లో నివాసముంటున్న ఎస్ మోహిత్‌కు చిన్నతనం నుంచే క్రీడలంటే అమితాసక్తి. దీంతో అతని పేరెంట్స్ స్కూల్లో తైక్వాండో శిక్షణలో చేర్పించారు. దీంతో పాఠశాల స్థాయిలోనే అనేక పోటీల్లో మెడల్స్ సాధించాడు. యుక్త వయసులోకి వచ్చాక తైక్వాండో నుంచి ఎంఎంఏ వైపు ఆసక్తి మళ్లింది. దీంతో గ్రాప్లింగ్ (రెజ్లింగ్) శిక్షణ మొదలుపెట్టాడు. బీటెక్ చదువుతూనే సాయంత్రం వేళ నారాయణగూడలో శిక్షణ ప్రారంభించాడు. రెజ్లింగ్, బాక్సింగ్, కరాటే, తైక్వాండో, స్ట్రిక్కింగ్ వంటి కొట్లాట క్రీడలను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు.యూట్యూబ్‌లో టెక్నికల్ స్కిల్స్.. గతేడాది సర్దార్ పటేల్ కేసరిగా పిలిచే జిల్లా స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ సమయంలో బీటెక్ పరీక్షల కారణంగా ప్రాక్టీస్‌కు పెద్దగా టైం దొరకలేదు. దీంతో యూట్యూబ్‌లో మునుపటి మ్యాచ్‌లు, ఎంఎంఏ ప్రొఫెషనల్స్ అన్షుల్ జుబ్లీ, అలెక్స్ పెరీరా వీడియోలను చూసి, టెక్నికల్ స్కిల్స్ ప్రాక్టీస్ చేశాడు. ఈ పోటీలో 90 కిలోల కేటగిరిలో పాల్గొని, మహారాష్ట్ర ప్రత్యర్థులను చిత్తు చేసి బంగారు పతకం సాధించాడు. ఈ ఏడాది ఓపెన్ కిక్‌బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచిన తర్వాత బెల్ట్ మ్యాచ్ కోసం పోటీపడ్డాడు. ప్రత్యర్థి తన కంటే 5–6 కిలోల బరువు ఎక్కువగానే ఉన్నాడు. అయినా సరే నైపుణ్యం, దృఢ సంకల్పంతో మ్యాచ్‌లో ప్రత్యర్థిని రెండు సార్లు నాకౌట్‌తో పడగొట్టగలిగాడు. ఇండియాకు ప్రాతినిథ్యం నా లక్ష్యం..చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. దీంతో శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉంటారు. ఎంఎంఏ క్రీడ శిక్షణ, మార్గదర్శకత్వం చేయడంతో పాటు ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించాలన్నదే నా లక్ష్యం. – మోహిత్ -
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్.. పోలీసుల డ్రామా..!
-
Mohit Rai: స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా..
స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా.. వాళ్లు అటెండ్ అయ్యే ఈవెంట్లకు అనుగుణంగా తీర్చిదిద్దడమంటే అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు! కానీ దాన్ని అవలీలగా చేసేసే స్కిల్ పేరే మోహిత్ రాయ్!‘స్టయిలిస్ట్ బై డే, బ్యాట్మన్ బై నైట్’ అని తనను తాను వర్ణించుకునే మోహిత్ రాయ్ స్వస్థలం ఢిల్లీ. అక్కడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. వెంటనే హార్పర్స్ బజార్ ఇండియా మ్యాగజైన్లో ఫ్యాషన్ స్టయిలిస్ట్‌గా ఉద్యోగం దొరికింది. అక్కడ మూడేళ్లు పనిచేశాక ముంబైకి మకాం మార్చాడు. అక్కడైతే అవకాశాలు ఎక్కువుంటాయని. అక్కడ ‘ద వార్డ్‌రోబిస్ట్’లో క్రియేటివ్ డైరెక్టర్‌గా చేరాడు.రెండేళ్లకు ‘హార్పర్స్ బజార్ బ్రైడ్ ఇండియా’లో ఫ్యాషన్ డైరెక్టర్‌గా కొలువు దొరికింది. అప్పుడే.. ‘ఫాలో మీ టు’ ఫొటో సిరీస్‌తో ఫేమస్ అయిన రష్యన్ ఫొటోగ్రాఫర్ మురాద్ ఉస్మాన్ తన భార్య నటాలియాతో ఇండియా వచ్చాడు. ఆ ఇద్దరితో అద్బుతమైన కవర్ షూట్ చేయించాడు హార్పర్స్ బజార్ కోసం. అది వైరల్ అయి మోహిత్‌ని పాపులర్ చేసింది. ఆ ఖ్యాతిని తన అంట్రప్రెన్యూర్షిప్కి పిల్లర్‌గా వేసుకున్నాడు. ‘ఎమ్ఆర్ (మోహిత్ రాయ్) స్టయిల్స్’ను స్థాపించాడు.ఈ సంస్థ స్టార్ స్టయిలింగ్, సెలబ్రిటీ వెడ్డింగ్స్ మీద ఫోకస్ చేస్తుంది. దీని ద్వారానే మోహిత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అతను మొదట స్టయిలింగ్ చేసింది.. హీరోయిన్ సోనాక్షీ సిన్హాకు. తర్వాత చిత్రాంగదా సింగ్, కరీనా కపూర్, కంగనా రనౌత్, శిల్పా శెట్టిలాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరికో స్టయిలిస్ట్‌గా చేశాడు.ఎమ్ఆర్ స్టయిల్స్ బాధ్యతలు చూసుకుంటూనే తన స్నేహితుడు షోహ్న దాస్‌తో కలసి ‘గ్రెయిన్ ఫ్యాషన్ కన్సల్టెన్సీ’నీ ప్రారంభించాడు. పలు ఫ్యాషన్ లేబుల్స్‌కి డిజైన్, స్టయిలింగ్‌లో గైడెన్స్ ఇస్తుందీ సంస్థ.‘స్టార్‌కున్న ఇండివిడ్యువల్ స్టయిల్ అండ్ పర్సనాలిటీని ఎలివేట్ చేయటమే స్టయిలిస్ట్ జాబ్’అని నమ్మే మోహిత్ రాయ్‌ని ‘మీకిష్టమైన సెలబ్రిటీ ఎవరు’ అని అడిగితే ‘సోనాక్షి సిన్హా’ అని చెబుతాడు. ‘ఫ్యాషన్ విషయంలో సోనాక్షీ ఎక్స్పరిమెంటల్ అండ్ ఓపెన్. రెండేళ్లు ఆమెతో కలసి పనిచేశాను. స్టయిలిస్ట్‌ని నమ్ముతుంది. చెప్పేది వింటుంది. డిఫర్ అయితే డిస్కస్ చేస్తుంది. ఆ చర్చలు నాకెంతో ఉపయోగపడ్డాయి. నా పనిని మెరుగుపరచాయి. అందుకే సోనాక్షీ అంటే నాకు చాలా రెస్పెక్ట్’ అంటాడు మోహిత్ రాయ్."నా పనిని చూసుకున్న ప్రతిసారీ .. అరే ఇంతకన్నా బాగా చేసుండాల్సింది అనిపిస్తుంది. అందుకే రోజూ ఆత్మవిమర్శ చేసుకుంటాను. పొరపాట్ల నుంచి పాఠాలు గ్రహిస్తాను. దానివల్ల నా పనితీరు రోజురోజుకి మెరుగవుతుంది. సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నప్పుడు మన వర్క్ స్టయిల్ హార్డ్‌వర్క్ అండ్ స్మార్ట్వర్క్ల కాంబినేషన్‌గా ఉండాలి!" – మోహిత్ రాయ్ -
చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ మూకల ఆగడాలు, రౌడీయిజానికి అంతేలేకుండా పోయింది. పోలింగ్ ముగిసిన అనంతరం సోమవారం రాత్రి 9.45 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు వీరి పైశాచిక విధ్వంసకాండ కొనసాగింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, స్థానిక సర్పంచి కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కుమారుడు వినీల్ ఆధ్వర్యంలో పచ్చ మంద దాడి చేసింది.సర్పంచి ఇంటికి నిప్పు పెట్టింది. విలువైన వస్తువులు, నగదు, బంగారం, ల్యాప్‌టాప్ వంటి వస్తువులను లూటీ చేసింది. పంచాయతీలో అధిక శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి అండగా ఓటింగ్‌లో పాల్గొన్నారనే అక్కసుతోనే పచ్చ మంద ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు. దాడికి గురైన సర్పంచి చంద్రశేఖర్‌రెడ్డిని పరామర్శించేందుకు రామిరెడ్డిపల్లికి వస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని టీడీపీ శ్రేణులు, చిత్తూరు నుంచి దిగుమతి చేస్తున్న రౌడీలతో ఉన్న వినీల్ అడ్డుకున్నారు. మోహిత్‌రెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఆయన కారును పెట్రోలు పోసి దగ్ధం చేశారు. మరో కారును రాడ్లు, కర్రలు, బండరాళ్లతో ధ్వంసం చేశారు. కారు డ్రైవర్, మాజీ సైనికుడిని కట్టేసి కొట్టారు. ఈ దాడిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నానీయే మోహిత్‌రెడ్డి అనుచరులను కొట్టారు. బాధితులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చిపోయిన పచ్చ మూకలు తిరుపతిలో మంగళవారం ‘పచ్చ’ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ వద్ద టీడీపీ అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పచ్చమూకలను రెచ్చగొట్టారు. దీంతో వర్సిటీ ముందు రోడ్డుపై బైఠాయించి ఈ మూకలు ఆందోళన చేశాయి. రోడ్డుపై వెళ్తున్న అమాయకులను సైతం పట్టుకుని ‘మీరు వైఎస్సార్సీపీ వాళ్లే కదా... ’అంటూ విచక్షణా రహితంగా కొట్టాయి. వర్సిటీ రోడ్డు మీదుగా తుమ్మలగుంటకు వెళ్తున్న తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయతీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మొదలియార్ రమేష్, అతని అనుచరుల కారును అడ్డగించాయి. రమేష్‌తో పాటు కారులో ఉన్న అనుచరులను రోడ్డుపైకి లాగి.. పది మంది కలిసి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. కాళ్లతో తన్నుతూ, స్పృహ తప్పిపోయేంతగా కొట్టారు. అంతటితో ఆగక, విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఎస్వీయూ, మహిళా వర్శిటీ, పద్మావతి కళాశాల ఉద్యోగులపై సైతం దాడులు చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోదరుడు రఘునాధరెడ్డికి చెందిన బుల్లెట్, మరో 10 వాహనాలపై వైఎస్సార్సీపీ గుర్తులు ఉన్నాయని కాల్చి వేశారు. వీడియోలు తీస్తున్న మీడియాపై సైతం దాడికి పాల్పడ్డారు. ‘పులివర్తి నాని అన్న చెప్పాడు.. వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను తరిమి తరిమి కొట్టండి’ అంటూ గంజాయి మత్తులో ఉన్న పచ్చమూక రెచ్చిపోయింది. ఈ గూండాల విధ్వంసంతో వర్సిటీ పరిసరాలు హాహాకారాలు.. రక్తపు గాయాలు.. ఎగిసిపడే మంటలతో యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. చివరకు పోలీస్ బలగాలు భారీగా తరలివచ్చి లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి0ది. -
చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై దాడి
తిరుపతి రూరల్/చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై చంద్రగిరి మండలం కూచువారిపల్లెలో సోమవారం టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఈ దాడిలో పాల్గొని మోహిత్‌రెడ్డి కారును దగ్థం చేసి ఆయన అనుచరులపై రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే..చంద్రగిరి మండలం రామిరెడ్డిగారిపల్లె వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డిపై టీడీపీకి చెందిన కొందరు సోమవారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. అతన్ని పరామర్శించేందుకు మోహిత్‌రెడ్డి తన సోదరుడు హర్షిత్‌రెడ్డితో కలిసి రామిరెడ్డి పల్లెకు బయల్దేరారు. ఆ గ్రామానికి ముందు కూచువారిపల్లెలో టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గుమికూడి రోడ్డు మధ్యలో మోహిత్‌రెడ్డి కారును అడ్డుకున్నారు. చంద్రశేఖర్‌రెడ్డిని పరామర్శించడానికి వెళ్లొద్దని చుట్టుముట్టారు. తమ నాయకుడిని పరామర్శించడానికి మీ అనుమతేంటని మోహిత్‌రెడ్డి వారిని ప్రశ్నించారు. దీంతో మోహిత్‌రెడ్డి కారును కదలనివ్వకుండా చుట్టుముట్టారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మె ల్యే అభ్యర్థి పులివర్తి నాని అక్కడకు చేరుకున్నాడు. దూకుడుగా వచ్చి మోహిత్‌రెడ్డి అనుచరులు కౌలిక్ పై దాడిచేశాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. రక్తం కారేలా గాయపరిచాడు. మోహిత్‌రెడ్డిపై కూడా దాడి చేయడంటూ అనుచరులను రెచ్చగొట్టాడు. దీంతో ఆయన అనుచరులు, టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. మోహిత్‌రెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ, మోహిత్‌రెడ్డి గన్మెన్లు అతనికి రక్షణగా నిలబడి దాడిని అడ్డుకుని ఆయన సురక్షితంగా పక్కకు తీసుకొచ్చారు. దీంతో టీడీపీ గూండాలు మోహిత్‌రెడ్డి కారును దగ్థంచేశారు. మరో కారును కూడా ధ్వంసం చేయడంతో వేరే కారులో మోహిత్‌రెడ్డిని గన్మెన్లు రామిరెడ్డిపల్లెకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా నాని, ఆయన కుమారుడు, అనుచరులు 2 గంటలపాటు అక్కడే ఉండి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. రాత్రి 10.30 గంటలకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు.సర్పంచ్‌పై దాడి.. ఇల్లు ధ్వంసంరాత్రి 11:30 గంటలకు కూచువారిపల్లెలో సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై 500 మందికిపైగా టీడీపీ గూండాలు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. ఎడ్ల బండ్లనూ తగలబెట్టారు. -
తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
మోహిత్ కి పాండ్య పాఠాలు చెప్పడం ఏంటి ..!
-
తండ్రైన ‘ఉరి’ నటుడు.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్య
ప్రముఖ బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా తండ్రి అయ్యాడు. శుక్రవారం ఆయన భార్య అదితి శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మోహిత్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కూతురు వేలు పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మోహిత్ మురిసిపోయాడు. ‘మేము ఇద్దరం కాస్తా ముగ్గురం అయ్యాం. ఈ ప్రపంచంలోకి మా బేబీ గర్ల్‌కి స్వాగతం’ అంటూ ఫ్యాన్స్‌తో గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. బుల్లితెరపై మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న మోహిత్ రైనా ఉరి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ‘దేవోమ్ కా దేవ్ మహాదేవ్’ అనే టీవీ సిరీస్‌తో బుల్లితెరపై పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో విక్కీ కౌషల్ ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రంలో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. View this post on Instagram A post shared by Mohit Raina (@merainna) -
డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి భర్త అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్ మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్‌ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన భార్య నేహా దేశ్‌పాండే పలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. అతడు డీజే నిర్వాహకులతోపాటు ఈవెంట్లలో మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని, గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ నుంచి వీటిని ఖరీదు చేసేవాడని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన మోహిత్ 2014లో ‘ది అన్‌స్క్రిప్టెడ్’పేరుతో సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, ముంబై, గోవా, బెంగళూరుల్లో జరిగే అనేక ఈవెంట్లు, పబ్స్‌కు డీజేలు సరఫరా చేస్తున్నాడు. గోవాలో సన్‌బర్న్ బీచ్ క్లబ్ సహా అనేక భారీ ఈవెంట్స్ నిర్వహించాడు. ఆయా పబ్స్ నిర్వాహకులతో కలిసి వాటిలో ప్రత్యేకంగా రేవ్ పార్టీలు నిర్వహించే వాడు. దీనికోసం ఎడ్విన్‌సహా దాదాపు 50 మంది డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి నుంచే కొకైన్ ఖరీదు చేసి సరఫరా చేసేవాడు. ‘క్రూయిజ్’లో ఆధారాల్లేక.. గతేడాది అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు ముంబై క్రూయిజ్ డ్రగ్ పార్టీపై దాడి చేసి షారూఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ సహా పలువురిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహిత్ కూడా అదే క్రూయిజ్‌లో ఉన్నా ఇతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోవడం, ఆర్యన్‌తో సంబంధాలపై ఆధారాలు లేకపోవడంతో అధికారులు విడిచిపెట్టారు. గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్‌ను హెచ్–న్యూ అధికారులు గతేడాది నవంబర్ 5న అరెస్టు చేసి విచారించగా మోహిత్ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు గోవా, ముంబైల్లో తలదాచుకున్నాడు. హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్ నేతృత్వంలోని బృందం అతడి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించింది. మోహిత్ ‘డిసెంబర్ 31’న గోవాలో రూ.2 కోట్లు వెచ్చించి భారీ ఈవెంట్ నిర్వహించినట్లు సమాచారం అందుకున్న హెచ్–న్యూ బృందం అక్కడికి వెళ్లగా త్రుటిలో తప్పించుకుని విమానంలో హైదరాబాద్ వచ్చేశాడు. వేట కొనసాగించిన హెచ్–న్యూ ఎట్టకేలకు అతడిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకుంది. రామ్‌గోపాల్‌పేట ఠాణాలో ఉన్న ఎడ్విన్ కేసులోనూ రిమాండ్‌కు తరలించింది. విచారణలో నగరానికి చెందిన అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులతో అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. అయితే వారిలో ఎందరు డ్రగ్స్ ఖరీదు చేశారు? ఏఏ పబ్స్ నిర్వాహకులతో అతడికి ఒప్పందాలు ఉన్నాయనే వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ దందాలో మోహిత్ భార్య నేహా దేశ్‌పాండేకు ఏమైనా లింకు ఉందా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేహా దేశ్‌పాండే ‘ది కిల్లర్, దిల్ దివానా, బెల్స్’తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఇదీ చదవండి: సర్వం ‘త్రిమూర్తుల’ కనుసన్నల్లోనే! -
డ్రగ్స్ కేసులో హీరోయిన్ నేహా దేశ్‌పాండే భర్త మైరాన్ మోహిత్ అరెస్ట్
-
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ భర్త అరెస్ట్
టాలీవుడ్‌కు చెందిన చెందిన ప్రముఖ హీరోయిన్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నటి నేహా దేశ్ పాండే భర్తను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్‌గా నేహా దేశ్‌పాండే భర్త మైరాన్ మోహిత్ కొనసాగుతున్నారు. హైదరాబాద్‌తో పాటు గోవా, ముంబై నగరాల్లో డ్రగ్స్ సరఫరా చేసేవారితో మోహిత్‌కు పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు వందకు పైగా డీజేలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడని తెలుస్తోంది. గోవాతో పాటు దేశంలోని పలు నగరాల్లో డీజేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ముంబైకి మోహిత్ వెళ్లినట్లు సమాచారం. పబ్‌ల్లో వెయిటర్‌గా పని చేస్తూ డ్రగ్ సప్లయర్‌గా మారినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ది కిల్లర్, దిల్ దివాన్, బెల్స్ బాలీవుడ్ సినిమాల్లో నేహా దేశ్‌పాండే నటించింది. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు
Dev Mahadev Star Mohit Raina Secretly Marries Aditi : బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. జనవరి1న న్యూ ఇయర్ సందర్భంగా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. సాధారణంగా సెలబ్రిటీల వివాహం అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఆ హడావిడి సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మోహిత్ మాత్రం పెళ్లి తేదీ వరకు తన వివాహాన్ని అత్యంత రహస్యంగా ఉంచాడు. గత కొన్నాళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నా ఆ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. తాజాగా ప్రియురాలిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభమవుతుందని, మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. ఇక చూడముచ్చటైన ఈ జంటకు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న మోహిత్ మహాదేవ్ సీరియల్‌తో ఎంతో పాపులర్ అయ్యాడు. శివుడి పాత్రలో మోహిత్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2019లో వచ్చిన యురి..ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో సైతం కీలక పాత్రలో కనిపించాడు. View this post on Instagram A post shared by Mohit Raina (@merainna) -
రాణించిన మోహిత్
సాక్షి, హైదరాబాద్: బౌలింగ్‌లో టీఎన్ఆర్ మోహిత్ (5/41) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ... బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో డేనియల్ క్రికెట్ అకాడమీ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో జరుగుతోన్న రెసిడెన్షియల్ క్రికెట్ ట్రెయినింగ్ క్యాంప్ టోర్నీలో భాగంగా సోమవారం వర్డ్లీ క్రికెట్ అకాడమీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో డేనియల్ జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వర్డ్లీ జట్టు మోహిత్ ధాటికి 38 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. గోవింద్ (45) రాణించాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన మోహిత్ 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 220 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన డేనియల్ క్రికెట్ అకాడమీ జట్టు 30 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. చరణ్ (42), సచిత్ (30) పర్వాలేదనిపించగా... మిగతా బ్యాట్స్‌మన్ మూకుమ్మడిగా విఫలమయ్యారు. -
అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తల్లి
ఉదయ్‌పూర్: రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం అల్లుడితో కలిసి కన్నా కొడుకునే చంపించింది ఓ తల్లి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌ఘడ్ జిల్లా చోటిసాద్రి గ్రామానికి చెందిన మోహిత్(21) తన తల్లి ప్రేమ్‌లత సుతార్‌తో తరచూ గొడవ పడేవాడు. తండ్రి చనిపోయాక ఈ గొడవ మరింత ముదిరింది. దీంతో విసుగు చెందిన ప్రేమ్‌లత కూతురి దగ్గరికి వెళ్లి అక్కడే ఉంటుంది. కాగా నెల రోజుల క్రితం ఆమె తన ఊళ్లో ఉన్న భూమిని అమ్మడానికి ప్రయత్నించింది. దీనికి మోహిత్ అడ్డుపడ్డాడు. దీంతో ఎలాగైనా కొడుకు అడ్డుతొలగించుకోవాలని అల్లుడితో కలిసి కుట్రపన్నింది. మోహిత్‌ను అంతమొందించడం కోసం అదే ప్రాంతానికి చెందిన రౌడీ గణపత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆశ్రయించారు. హత్య కోసం అతనితో లక్ష రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. యాభైవేల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఈ నెల 6న మోహిత్ గ్రామానికి దగ్గరలో ఉన్న దాబాకి వెళ్లాడు. అక్కడే ఉన్న గణపత్, అనిల్‌లు ప్లాన్ ప్రకారం మోహిత్‌కి మద్యం తాగించారు. మోహిత్ మత్తులోకి వెళ్లాక ఇద్దరు కలిసి గొంతు పిసికి చంపేశారు. సీసీ పుటేజీ సాయంతో నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. -
ఫైనల్లో మోహిత్, సతిందర్
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత బాక్సర్లు మోహిత్ ఖతానా (80 కేజీలు), సతిందర్ రావత్ (ప్లస్ 80 కేజీలు) ఫైనల్ పంచ్‌కు సిద్ధమయ్యారు. ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మరో ఆరుగురు బాక్సర్లు అంకిత్ నర్వాల్ (57 కేజీలు), భవేశ్ (52 కేజీలు), సిద్ధార్థ మలిక్ (48 కేజీలు), వినీత్ దహియా (75 కేజీలు), అక్షయ్ సివచ్ (60 కేజీలు), అమన్ షెరావత్ (70 కేజీలు) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. సెమీఫైనల్లో మోహిత్ 4–1తో రఖ్మోనోవ్ కామ్రోన్‌బెక్ (ఉజ్బెకిస్తాన్)ను కంగుతినిపించగా, సతిందర్ 4–1తో అర్నుర్ అక్మెట్జనోవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. మిగతా క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో జవ్లోన్‌బెక్ యుల్దషెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో అంకిత్, షేక్‌సెన్ బిబార్స్ (కజకిస్తాన్) చేతిలో భవేశ్, యానో తొషియా (జపాన్) చేతిలో సిద్ధార్థ పరాజయం చవిచూశారు. వినీత్‌పై మక్సూత్ కువడిక్ (కజకిస్తాన్), అక్షయ్‌పై రీయితో సుత్సుమి, అమన్‌పై సలీమ్ సలేహ్ (ఇరాక్) గెలుపొందారు. -
కోర్టులో గ్యాంగ్‌వార్.. గుండెలోకి బుల్లెట్లు
-
కోర్టులో గ్యాంగ్‌వార్.. గుండెలోకి బుల్లెట్లు
న్యూఢిల్లీ: న్యాయస్థానంలోనే గ్యాంగ్ వార్ జరిగింది. కోర్టు ప్రాంగణంలోనే దారుణం చోటుచేసుకుంది. కోర్టు హాజరుకు తీసుకొస్తున్న విచారణ ఖైదీపై ఓ కిరాయి హంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణీ కోర్టులో శనివారం ఉదయం జరిగింది. రాజేశ్ దుర్ముత్ అనే విచారణలో ఉన్న ఖైదీని హర్యానా పోలీసులు కోర్టుకు తీసుకొస్తుండగా అదే సమయంలో కోర్టు వద్ద ఉన్న పెద్ద సమూహంలో నుంచి దూసుకొచ్చిన మోహిత్ అనే వ్యక్తి నాటు తుపాకీ తీసుకొని కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్లు అతడి భుజంలోకి, గుండెలోకి దూసుకెళ్లాయి. దీంతో అతడు చనిపోయాడు. కాల్పులు జరిపిన కిరాయి హంతకుడు అంతటితో ఆగకుండా మరో తుపాకీ తీసి పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ తుపాకీ పేలలేదు. దీంతో అతడు పారిపోయేందుకు ప్రయత్నించినా చివరికి దొరికిపోయాడు. బాధితుడు దుర్ముత్ నీతు దాబోడియా గ్యాంగ్‌లో సభ్యుడు. ఇతడిపై 16 దొంగతనం, హత్యలు, దోచుకోవడంలాంటి కేసులు ఉన్నాయి. రెండు రోజుల ముందు నుంచే మోహిత్ ప్లాన్ చేసుకొని పోలీసుల వాహనాన్ని అనుసరించి ఈ హత్య చేసినట్లు తెలిసింది. -
మూడేళ్ల బాలుడి కిడ్నాప్... రూ. కోటి డిమాండ్
నెల్లూరు: నెల్లూరులోని సైదాపురంలో మూడేళ్ల బాలుడు మోహిత్‌ను మంగళవారం ఆగంతకులు కిడ్నాప్ చేశారు. మోహిత్‌ను విడిచిపెట్టాలంటే రూ. కోటి చెల్లించాలని కిడ్నాపర్లు మోహిత్ తల్లిదండ్రులకు ఫోన్ లో డిమాండ్ చేశారు. దాంతో వారు నగర పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే చిన్నారి కిడ్నాప్‌కు రియల్ ఎస్టేట్ వివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు.