ప్రముఖ బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా తండ్రి అయ్యాడు. శుక్రవారం ఆయన భార్య అదితి శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మోహిత్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కూతురు వేలు పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మోహిత్ మురిసిపోయాడు. ‘మేము ఇద్దరం కాస్తా ముగ్గురం అయ్యాం. ఈ ప్రపంచంలోకి మా బేబీ గర్ల్‌కి స్వాగతం’ అంటూ ఫ్యాన్స్‌తో గుడ్‌న్యూస్ పంచుకున్నాడు.
బుల్లితెరపై మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న మోహిత్ రైనా ఉరి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ‘దేవోమ్ కా దేవ్ మహాదేవ్’ అనే టీవీ సిరీస్‌తో బుల్లితెరపై పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో విక్కీ కౌషల్ ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రంలో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment