న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత బాక్సర్లు మోహిత్ ఖతానా (80 కేజీలు), సతిందర్ రావత్ (ప్లస్ 80 కేజీలు) ఫైనల్ పంచ్‌కు సిద్ధమయ్యారు. ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మరో ఆరుగురు బాక్సర్లు అంకిత్ నర్వాల్ (57 కేజీలు), భవేశ్ (52 కేజీలు), సిద్ధార్థ మలిక్ (48 కేజీలు), వినీత్ దహియా (75 కేజీలు), అక్షయ్ సివచ్ (60 కేజీలు), అమన్ షెరావత్ (70 కేజీలు) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
సెమీఫైనల్లో మోహిత్ 4–1తో రఖ్మోనోవ్ కామ్రోన్‌బెక్ (ఉజ్బెకిస్తాన్)ను కంగుతినిపించగా, సతిందర్ 4–1తో అర్నుర్ అక్మెట్జనోవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. మిగతా క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో జవ్లోన్‌బెక్ యుల్దషెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో అంకిత్, షేక్‌సెన్ బిబార్స్ (కజకిస్తాన్) చేతిలో భవేశ్, యానో తొషియా (జపాన్) చేతిలో సిద్ధార్థ పరాజయం చవిచూశారు. వినీత్‌పై మక్సూత్ కువడిక్ (కజకిస్తాన్), అక్షయ్‌పై రీయితో సుత్సుమి, అమన్‌పై సలీమ్ సలేహ్ (ఇరాక్) గెలుపొందారు.
ఫైనల్లో మోహిత్, సతిందర్
Published Mon, Aug 7 2017 1:03 AM | Last Updated on Mon, Sep 11 2017 11:26 PM
Advertisement