Satinder
-
యానిమల్ సక్సెస్ మీట్లో అలియా ధరించిన డ్రస్ ధర ఎంతంటే..?
సెలబ్రెటీలు ధరించిన డ్రస్‌లు ఎప్పడూ అత్యంత ఖరీదులోనే ఉంటాయి. వాటికి గోల్స్ అంచు లేదా డైమండ్లు పొదగబడి ఉండటం వంటివి జరుగుతాయి కూడా. అయితే కొన్ని ఖరీదైన డ్రస్‌లు చూస్తే ఏముంది ఇందుల? ఎందుకింత ఖరీదు? అనిపిస్తుంది. అలాంటి డ్రస్ అలియా వేసుకొచ్చింది. అదికూడా తన భర్త నటించిన యానిమల్ మూవీ సక్సెస్ మీట్‌కి. ఆమె భర్త రణబీర్ కపూర్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఒకరకంగా చాలా రోజుల తర్వాత బాలీవుడ్ మూవీ ఈరేంజ్‌లో దూసుకుపోతున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. అదిగాక ఈ మూవీలో "జమల్ జమలు కుదు" పాట ఎంతలా వైరల్ అవుతోందో చెప్పాల్సివసరం లేదు. ఈ మేరకే ఈ సినిమా బృందం తమ మూవీ విజయోత్సవాన్ని జరుపుకుంది. ఈ వేడుకకు అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ మూవీ సక్సస్‌ని పంచుకునేందుకు మంచి గ్రాండ్ లుక్‌తో వచ్చారు. ఈ వేడుకలో ఆమె నీలిరంగు దుస్తుల్లో స్టన్నింగ్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ శాటిన్ కటౌట్ డ్రస్‌లో చాలా గ్లామరస్‌గా కనిపించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సంస్థ రసారియో కలక్షన్స్ ఈ డ్రెస్‌ని డిజైన్ చేసింది. దీని ధర ఏకంగా రూ. 1.5 లక్షలు. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ రణబీర్, అలియా జంట, రణబీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీడియోల్, అనిల్‌కపూర్, డైరెక్టర్లు,తదితర బాలివుడ్ తారాగణమంతా హాజరయ్యారు. (చదవండి: జమల్ జమలు కుదు... యానిమలు!) -
గోల్డీని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక ఉపా చట్టం కింద అతడిని ఉగ్రవాది ప్రకటిస్తున్నట్లు హోం శాఖ సోమవారం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. పాకిస్తాన్ దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోం శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. పంజాబ్‌లోని శ్రీముక్త్సర్ సాహిబ్‌కు చెందిన బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉంటున్నాడు. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. -
ఆర్టిస్ట్ టు బారిస్టర్
ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే బుర్ర దెయ్యాల ఫ్యాక్టరీ అవుతుందట!లాక్డౌన్ టైమ్‌లో సతిందర్కు బోలెడు ఖాళీ సమయం దొరికింది.ఆ ఖాళీ సమయంలో వృథా ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెనడాలో లా డిగ్రీ ఉత్తీర్ణురాలై ప్రశంసలు అందుకుంటోంది సతిందర్... పంజాబ్‌లోని బటాలా పట్టణానికి చెందిన సతిందర్ సట్టి నటి, కవయిత్రి, డ్యాన్సర్, సింగర్, టెలివిజన్ యాంకర్‌గా బహుముఖ ప్రజ్ఞ చాటుకుంది. ‘కవిత్వం అనేది విప్లవాత్మకమైన వేదిక’ అని చెప్పే సతిందర్ కవిత్వంలో సామాజిక సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. టీవి యాంకర్‌గా ఎంతోమంది సామాన్యుల అద్భుతగాథలను ‘బోల్ దే’ కార్యక్రమంతో ప్రేక్షకులకు పరిచయం చేసింది. ‘పంజాబ్ ఆర్ట్స్ కౌన్సిల్’ ఛైర్‌పర్సన్‌గా సతిందర్ నియామకం అయినప్పుడు ‘నలభై ఏళ్లు దాటని వ్యక్తికి ఈ పదవి ఎలా ఇస్తారు’ అని కొందరు పనిగట్టుకొని విమర్శించారు.అయితే తన పనితీరుతో విమర్శించిన వారే ప్రశంసించేలా చేసింది సతిందర్. తాజా విషయానికి వస్తే.... ‘సతిందర్ ఇప్పుడు కెనడాలో బారిస్టర్’ అంటూ వార్తల్లోకి వచ్చింది. 2020లో సతిందర్ కెనడాలో ఉంది. ఆ సమయంలో లాక్డౌన్ ప్రకటించడంతో ఇండియాకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ‘సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి?’ అనేదాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె దృష్టి లా డిగ్రీపై పడింది. అమృత్‌సర్‌లోని ‘గురునానక్ యూనివర్శిటీ’లో సతిందర్ ‘లా’ చేసింది. ఆ డిగ్రీని కెనడియన్ లా డిగ్రీతో అప్‌గ్రేడింగ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇండియాలో ‘లా’ చేసిన వారు కెనడాలో ప్రాక్టిస్ చేయాలంటే అక్కడి ఎన్సీఎ(నేషనల్ కమిటీ ఆన్ అక్రిడియేషన్) గుర్తింపు పొందాల్సి ఉంటుంది. దీని కోసం బారిస్టర్ ఎగ్జామ్స్‌కు హాజరు కావాలి. అయిదుకు పైగా ఎగ్జామ్స్ ఉంటాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోతే కెనడా లా స్కూల్లో సంవత్సరం పాటు చదవాల్సి ఉంటుంది.పరీక్షలకు ప్రిపేర్ కావడానికి గుర్ప్రీత్, జస్వంత్ మంగత్లాంటి న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకుంది. చాలామంది కఠినంగా భావించే ఆ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి బారిస్టర్ లైసెన్స్ పొందింది సతిందర్. లైసెన్స్ అవార్డింగ్ సమయంలో అక్కడి న్యాయ అధికారులు సతిందర్ బహుముఖ ప్రతిభ గురించి ప్రశంసించడం విశేషం. -
ఫైనల్లో మోహిత్, సతిందర్
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత బాక్సర్లు మోహిత్ ఖతానా (80 కేజీలు), సతిందర్ రావత్ (ప్లస్ 80 కేజీలు) ఫైనల్ పంచ్‌కు సిద్ధమయ్యారు. ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మరో ఆరుగురు బాక్సర్లు అంకిత్ నర్వాల్ (57 కేజీలు), భవేశ్ (52 కేజీలు), సిద్ధార్థ మలిక్ (48 కేజీలు), వినీత్ దహియా (75 కేజీలు), అక్షయ్ సివచ్ (60 కేజీలు), అమన్ షెరావత్ (70 కేజీలు) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. సెమీఫైనల్లో మోహిత్ 4–1తో రఖ్మోనోవ్ కామ్రోన్‌బెక్ (ఉజ్బెకిస్తాన్)ను కంగుతినిపించగా, సతిందర్ 4–1తో అర్నుర్ అక్మెట్జనోవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. మిగతా క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో జవ్లోన్‌బెక్ యుల్దషెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో అంకిత్, షేక్‌సెన్ బిబార్స్ (కజకిస్తాన్) చేతిలో భవేశ్, యానో తొషియా (జపాన్) చేతిలో సిద్ధార్థ పరాజయం చవిచూశారు. వినీత్‌పై మక్సూత్ కువడిక్ (కజకిస్తాన్), అక్షయ్‌పై రీయితో సుత్సుమి, అమన్‌పై సలీమ్ సలేహ్ (ఇరాక్) గెలుపొందారు.