యానిమల్‌ సక్సెస్‌ మీట్‌లో అలియా ధరించిన డ్రస్‌ ధర ఎంతంటే..? | Alia Bhatts Sultry Rs 1 Lakh Satin Dress For Animal Success Bash | Sakshi
Sakshi News home page

యానిమల్‌ సక్సెస్‌ మీట్‌లో అలియా ధరించిన డ్రస్‌ ధర వింటే నోరోళ్లబెట్టాల్సిందే!

Published Sun, Jan 7 2024 10:14 AM | Last Updated on Sun, Jan 7 2024 10:55 AM

Alia Bhatts Sultry Rs 1 Lakh Satin Dress For Animal Success Bash - Sakshi

సెలబ్రెటీలు ధరించిన డ్రస్‌లు ఎప్పడూ అత్యంత ఖరీదులోనే ఉంటాయి. వాటికి గోల్స్‌ అంచు లేదా డైమండ్లు పొదగబడి ఉండటం వంటివి జరుగుతాయి కూడా. అయితే కొన్ని ఖరీదైన డ్రస్‌లు చూస్తే ఏముంది ఇందుల? ఎందుకింత  ఖరీదు?  అనిపిస్తుంది. అలాంటి డ్రస్‌ అలియా వేసుకొచ్చింది. అదికూడా తన భర్త నటించిన యానిమల్‌ మూవీ సక్సెస్‌ మీట్‌కి. ఆమె భర్త రణబీర్‌ కపూర్‌ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌  వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

ఒకరకంగా చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌ మూవీ ఈరేంజ్‌లో దూసుకుపోతున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. అదిగాక ఈ మూవీలో "జమల్‌ జమలు కుదు" పాట ఎంతలా వైరల్‌ అవుతోందో చెప్పాల్సివసరం లేదు. ఈ మేరకే ఈ సినిమా బృందం తమ మూవీ విజయోత్సవాన్ని జరుపుకుంది. ఈ వేడుకకు అలియా భట్‌ తన భర్త రణబీర్‌ కపూర్‌ మూవీ సక్సస్‌ని పంచుకునేందుకు మంచి గ్రాండ్‌ లుక్‌తో వచ్చారు.

ఈ వేడుకలో ఆమె నీలిరంగు దుస్తుల్లో స్టన్నింగ్‌ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ శాటిన్‌ కటౌట్‌ డ్రస్‌లో చాలా గ్లామరస్‌గా కనిపించింది. ప్రముఖ​ ఫ్యాషన్‌ డిజైనర్‌ సంస్థ రసారియో కలక్షన్స్‌ ఈ డ్రెస్‌ని డిజైన్‌ చేసింది. దీని ధర ఏకంగా రూ. 1.5 లక్షలు. ఇక ఈ గ్రాండ్‌ ఈవెంట్‌ రణబీర్‌, అలియా జంట, రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్న, బాబీడియోల్‌, అనిల్‌కపూర్‌, డైరెక్టర్లు,తదితర బాలివుడ్‌ తారాగణమంతా హాజరయ్యారు. 

(చదవండి: జమల్‌ జమలు కుదు... యానిమలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement