![Actor Mohit Raina Secretly Marraied To Aditi See Wedding Pics - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/2/pic.gif.webp?itok=Phx6YNH5)
Dev Mahadev Star Mohit Raina Secretly Marries Aditi : బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. జనవరి1న న్యూ ఇయర్ సందర్భంగా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. సాధారణంగా సెలబ్రిటీల వివాహం అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఆ హడావిడి సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మోహిత్ మాత్రం పెళ్లి తేదీ వరకు తన వివాహాన్ని అత్యంత రహస్యంగా ఉంచాడు.
గత కొన్నాళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నా ఆ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. తాజాగా ప్రియురాలిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభమవుతుందని, మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. ఇక చూడముచ్చటైన ఈ జంటకు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా 2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న మోహిత్ మహాదేవ్ సీరియల్‌తో ఎంతో పాపులర్ అయ్యాడు. శివుడి పాత్రలో మోహిత్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2019లో వచ్చిన యురి..ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో సైతం కీలక పాత్రలో కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment