![Debina Bonnerjee Gurmeet Choudhary Remarried In Bengali Style Wedding - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/4/Debina-Bonnerjee1.jpg.webp?itok=9bfOHdck)
ప్రముఖ టెలివిజన్ స్టార్ కపుల్ డెబీనా-గుర్మీత్ చౌదరి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బెంగాళీ సాంప్రదాయంలో ఇద్దరూ మరోసారి వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవతున్నాయి. చూడచక్కని ఈ జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 'రామాయణ' టీవీ సీరియల్‌తో హిందీనాట పాపులర్ అయిన డెబీనా-గుర్మిత్‌లు షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.
2006లో ఇంట్లో చెప్పకండా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో పెద్దల అంగీకారంతో మరోసారి పెళ్లి చేసుకున్నారు.అవకాశం కుదిరినప్పుడల్లా ఒకరిపై మరొకరు సోషల్ మీడియా వేదికగా ప్రేమను కురిపిస్తూ హిందీ నాట మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.
గుర్మీత్ కంటే డెబీనా వయసులో నాలుగేళ్లు పెద్దది. అయితే వీరి వివాహం బెంగాళీ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని ఆమె భావించినా అప్పుడు అది కుదరలేదు. తాజాగా డెబీనా కోరికను గుర్మీత్ తీర్చాడు. ఆమెకు నచ్చిన విధంగా బెంగాలీ స్టైల్‌లో మరోసారి ఆమెను పెళ్లాడాడు. ఈ సందర్భంగా గుర్మీత్ బంగారు వర్ణపు ధోతీలో కనిపించగా, డెబీనా ఎరుపు రంగు చీరలో అందంగా ముస్తాబైంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment