![మూడేళ్ల బాలుడి కిడ్నాప్... రూ. కోటి డిమాండ్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41422609017_625x300_0.jpg.webp?itok=u7NnLM39)
మూడేళ్ల బాలుడి కిడ్నాప్... రూ. కోటి డిమాండ్
నెల్లూరు: నెల్లూరులోని సైదాపురంలో మూడేళ్ల బాలుడు మోహిత్ను మంగళవారం ఆగంతకులు కిడ్నాప్ చేశారు. మోహిత్ను విడిచిపెట్టాలంటే రూ. కోటి చెల్లించాలని కిడ్నాపర్లు మోహిత్ తల్లిదండ్రులకు ఫోన్ లో డిమాండ్ చేశారు. దాంతో వారు నగర పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే చిన్నారి కిడ్నాప్కు రియల్ ఎస్టేట్ వివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు.