![cine financier daughter kidnaped in chennai - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/4/07.jpg.webp?itok=feWY59My)
సినీ ఫైనాన్షియర్ బోద్రా కూమార్తె కరిష్మా బోద్రా
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీ ఫైనాన్షియర్ బోద్రా కూమార్తె కరిష్మా బోద్రా కిడ్నాప్‌నకు గురైనట్లు సమాచారం. సినీ ఫైనాన్షియర్ బోద్రా దక్షిణ సినిమా పరిశ్రమలో పలు చిత్రాలకు ఫైనాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కోచ్చాడయన్ చిత్రం విషయంలో లతా రజనీకాంత్‌పై బోద్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం కలకలం రేపింది.
ఈ కేసులో తన వద్ద తీసుకున్న డబ్బును లతా రజనీకాంత్ తిరిగి చెల్లించలేదంటూ బోద్రా ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో బోద్రా కుమార్తె కరిష్మా బోద్రా అదృశ్యమైంది. దీంతో బోద్రా తన కుమార్తె కిడ్నాప్‌కు గురైనట్లు శనివారం స్థానిక టీనగర్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం సినీ వర్గాల్లో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment