కె.ఎస్. నాగేశ్వరరావు
అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే జంటగా కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘బ్రేకప్ లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఎస్.ఎ. రెహమాన్ సమర్పణలో బి. చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఓ యువకుడు సాగించిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అది తన ప్రేమకథను ఎలా ప్రభావితం చేసింది అన్నదే ఈ చిత్ర కథాంశం. హైదరాబాద్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా చేయాలని ప్రభుత్వం తలపెట్టిన యజ్ఞానికి బాసటగా నిలిచే చిత్రమిది.
అనాథ అయిన అర్జున్ బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి. శ్రీవెంకట్ పాటలకు చక్కని స్పందన వచ్చింది. చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ‘లవ్ ఈజ్ బ్లైండ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. 70 శాతం పూర్తయింది’’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరరావు కథ చెప్పగానే విభిన్నంగా ఉందనిపించింది. సుమన్ ఓ వెరైటీ పాత్ర చేయగలడు అని ఈ సినిమాతో పేరొస్తుంది. మంచి విలన్ పాత్రలు ఇస్తే చేయడానికి రెడీ. నేటి జనరేషన్‌లో రాజమౌళి మాత్రం విలన్‌ని ఎంతో గొప్పగా చూపిస్తున్నారు. ‘బాహుబలి’లో హీరో ప్రభాస్ కాదు.. రానా. ఆయన పాత్ర అంత బాగుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment