ks nageswara rao
-
టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత
సాక్షి; హైదరాబాద్: టాలీవుడ్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతుంది. అప్పటివరకు తమతో ఉన్న తోటి నటులు, కళకారులు వివిధ కారణాలతో కన్ను మూయడం సినీ ప్రపంచాన్ని కలచివేస్తోంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ ఇవాళ(నవంబర్ 30) తుదిశ్వాస విడిచారు. నవంబర్ 28న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులు పాడవడంతో కన్నుమూశారు. అలాగే ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు నవంబర్ 27న గుండెపోటుతో తిరిగిరాని అనంతలోకాలకు తిరిగి వెళ్లిపోయారు. ఈ ఒక్క నాలుగు రోజుల్లోనే ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు మరణించడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత -
టాలీవుడ్లో మరో విషాదం.. ఆ దర్శకుడు ఇకలేరు
టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు హఠాన్మరణం చెందారు. నవంబర్ 27 శుక్రవారం ఉదయం ఆయన ఊరు నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఆయనకు ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఈ దర్శకుడి భౌతికకాయాన్ని ప్రస్తుతం వారి అత్తగారు ఊరైనా నల్లజర్ల దగ్గరలోని కౌలురు గ్రామంలో ఉంచారు. అక్కడే కెఎస్ నాగేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నాయి. దర్శకుడిగా నాగేశ్వరరావు తొలిచిత్రం 'రిక్షా రుద్రయ్య'. అనంతరం ఆయన రియల్ స్టార్ శ్రీహరిని 'పోలీస్' సినిమాతో హీరోగా పరిచయం చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. తర్వాత సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి, శివన్న, వైజయంతి వంటి చిత్రాలు తీశారు. కాగా నాగేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
బిచ్చగాళ్లు లేని సమాజాన్ని చూడాలి
అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే జంటగా కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘బ్రేకప్ లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఎస్.ఎ. రెహమాన్ సమర్పణలో బి. చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఓ యువకుడు సాగించిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అది తన ప్రేమకథను ఎలా ప్రభావితం చేసింది అన్నదే ఈ చిత్ర కథాంశం. హైదరాబాద్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా చేయాలని ప్రభుత్వం తలపెట్టిన యజ్ఞానికి బాసటగా నిలిచే చిత్రమిది. అనాథ అయిన అర్జున్ బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి. శ్రీవెంకట్ పాటలకు చక్కని స్పందన వచ్చింది. చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ‘లవ్ ఈజ్ బ్లైండ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. 70 శాతం పూర్తయింది’’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరరావు కథ చెప్పగానే విభిన్నంగా ఉందనిపించింది. సుమన్ ఓ వెరైటీ పాత్ర చేయగలడు అని ఈ సినిమాతో పేరొస్తుంది. మంచి విలన్ పాత్రలు ఇస్తే చేయడానికి రెడీ. నేటి జనరేషన్లో రాజమౌళి మాత్రం విలన్ని ఎంతో గొప్పగా చూపిస్తున్నారు. ‘బాహుబలి’లో హీరో ప్రభాస్ కాదు.. రానా. ఆయన పాత్ర అంత బాగుంది’’ అన్నారు. -
యువతరం ప్రేమకథ
రామ్ కార్తీక్, సహర్ హప్ష జంటగా కేయస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లవ్ ఈజ్ బ్లైండ్’ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ‘‘కొత్తవారిని ప్రోత్సహించేందుకే ఈ సినిమాను రూపొందిస్తున్నాం. కేయస్ నాగేశ్వరరావుతో గతంలో మేం వర్క్ చేశాం. ఓ చక్కటి ప్రేమకథతో మళ్లీ రాబోతున్నాం. హైదరాబాద్‌లో 15 రోజులు షూటింగ్ జరిపిన తర్వాత కాశ్మీర్లో చిత్రీకరణ జరుపుతాం. ఈ షెడ్యూల్ 30 రోజుల పాటు సాగుతుంది. ఆ నెక్ట్స్ మళ్లీ హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. ‘‘కొంత గ్యాప్ తర్వాత ఈ బ్యానర్లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. నేటి యువతారాన్ని ప్రతిబింబించే ప్రేమకథా చిత్రమిది’’ అన్నారు నాగేశ్వరరావు. ఈ సినిమాకు సబు వర్గీస్ సంగీతం అందిస్తున్నారు. -
బిచ్చగాళ్లు లేని సమాజం కోసం...
‘‘నిర్మాత చంద్రశేఖర్ అన్నీ తానే అయి కె.ఎస్.నాగేశ్వర రావు నుంచి చాలా మంచి ఔట్పుట్ తీసుకున్నారు. భవిష్యత్‌లో తను చాలా పెద్ద నిర్మాత అవుతాడు. శ్రీ వెంకట్ మ్యూజిక్ చాలా బాగుంది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ‘బిచ్చగాడా మజాకా’ సినిమా మంచి హిట్ అవుతుంది’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే జంటగా కె.ఎస్.నాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘ఎ బ్రేకప్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మించారు. శ్రీవెంకట్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడంతోపాటు, టైటిల్ సాంగ్ ఆలపించిన బాబూమోహన్ విడుదల చేశారు. కె.ఎస్.నాగేశ్వర రావు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాగా రిలీజ్ అవుతోన్న మా ‘బిచ్చగాడా మజాకా’ విడుదల తర్వాత పెద్ద సినిమా అవుతుంది. బాబూమోహన్గారి సహాయ సహకారాలు మరువలేనివి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’అన్నారు. ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఒక యువకుడు చేసిన పోరాటం ఎటువంటి మలుపులు తిరిగింది? అది అతని ప్రేమకథను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కథాంశంతో రూపొందించాం’’ అన్నారు బి.చంద్రశేఖర్. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే, శ్రీ వెంకట్, కెమెరామెన్ అడుసుమిల్లి విజయ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.ఎం.బాషా, లైన్ ప్రొడ్యూసర్ తేజా రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎస్.ఏ.రెహమాన్. -
కేఎస్ దర్శకత్వంలో... బాల భగత్‌సింగ్.
పోలీస్, దేవా, సాంబయ్య తదితర చిత్రాలతో మంచి యాక్షన్ దర్శకుడు అనిపించుకున్న కేయస్ నాగేశ్వరరావు ‘బాల భగత్‌సింగ్’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ విశేషాలను ఆయన తెలియజేస్తూ -‘‘మన దేశానికి స్వాతంత్య్రం రావడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ పోరాడిన యోధుడు భగత్‌సింగ్. ఆయన జీవిత చరిత్ర రాబోయే తరాలకు కూడా ఓ ఇన్స్పిరేషన్. అందుకే ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించబోతున్నా. అందరూ బాలతారలతోనే ఈ సినిమా చేయబోతున్నా. టైటిల్ రోల్‌ని మాస్టర్ మిథున్ పోషిస్తారు. మిగతా బాలనటుల ఎంపిక జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శివ కాకాని, మాటలు: సురేష్ కుమార్.