కేఎస్ దర్శకత్వంలో... బాల భగత్‌సింగ్. | bala Bhagat Singh Directed by ks nageswara rao | Sakshi
Sakshi News home page

కేఎస్ దర్శకత్వంలో... బాల భగత్‌సింగ్.

Published Fri, Nov 22 2013 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

కేఎస్ దర్శకత్వంలో... బాల భగత్‌సింగ్.

కేఎస్ దర్శకత్వంలో... బాల భగత్‌సింగ్.

పోలీస్, దేవా, సాంబయ్య తదితర చిత్రాలతో మంచి యాక్షన్ దర్శకుడు అనిపించుకున్న కేయస్ నాగేశ్వరరావు ‘బాల భగత్‌సింగ్’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ విశేషాలను ఆయన తెలియజేస్తూ -‘‘మన దేశానికి స్వాతంత్య్రం రావడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ పోరాడిన యోధుడు భగత్‌సింగ్. ఆయన జీవిత చరిత్ర రాబోయే తరాలకు కూడా ఓ ఇన్‌స్పిరేషన్. అందుకే ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించబోతున్నా. అందరూ బాలతారలతోనే ఈ సినిమా చేయబోతున్నా. టైటిల్ రోల్‌ని మాస్టర్ మిథున్ పోషిస్తారు. మిగతా బాలనటుల ఎంపిక జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శివ కాకాని, మాటలు: సురేష్ కుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement