రామ్ కార్తీక్, సహర్
రామ్ కార్తీక్, సహర్ హప్ష జంటగా కేయస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లవ్ ఈజ్ బ్లైండ్’ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ‘‘కొత్తవారిని ప్రోత్సహించేందుకే ఈ సినిమాను రూపొందిస్తున్నాం. కేయస్ నాగేశ్వరరావుతో గతంలో మేం వర్క్ చేశాం.
ఓ చక్కటి ప్రేమకథతో మళ్లీ రాబోతున్నాం. హైదరాబాద్‌లో 15 రోజులు షూటింగ్ జరిపిన తర్వాత కాశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుతాం. ఈ షెడ్యూల్ 30 రోజుల పాటు సాగుతుంది. ఆ నెక్ట్స్ మళ్లీ హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. ‘‘కొంత గ్యాప్ తర్వాత ఈ బ్యానర్‌లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. నేటి యువతారాన్ని ప్రతిబింబించే ప్రేమకథా చిత్రమిది’’ అన్నారు నాగేశ్వరరావు. ఈ సినిమాకు సబు వర్గీస్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment