
వీవీ వినాయక్, కేఎస్ నాగేశ్వరరావు, అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి, నేహాదేశ్ పాండే జంటగా కేఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘ఏ బ్రేకప్ లవ్‌స్టోరీ’ అనేది ఉప శీర్షిక. ఎస్.ఏ. రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై బి. చంద్రశేఖర్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. రిలీజ్ తర్వాత ఇందులోని మెసేజ్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇలాంటి వినోదాత్మక చిత్రాలను కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు ప్రోత్సహించాలి’’ అన్నారు. ‘‘వినాయక్ వంటి దర్శకులు మా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి మెచ్చుకోవడం గర్వంగా ఉంది. ‘కష్టపడి జీవితంలో పైకి వచ్చేవాడు లక్కీ ఫెలో. ఇతరుల కష్టంతో ఓసీగా బతుకుతూ పేదవాడిగా, బిచ్చవాడిగా జీవించేవాడు అన్ లక్కీఫెలో’ అనే ఫిలాసఫీ ఆధారంగా సినిమాను తెరకెక్కించాం. సెన్సార్ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం’’ అని బి. చంద్రశేఖర్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment