వజ్రాలు కావాలా! | vajralu kavala nayana Release on 17th | Sakshi
Sakshi News home page

వజ్రాలు కావాలా!

Feb 12 2017 11:20 PM | Updated on Sep 5 2017 3:33 AM

వజ్రాలు కావాలా!

వజ్రాలు కావాలా!

అనిల్‌ బూరగాని, నేహా దేశ్‌పాండే, నిఖితా బిస్థ్‌ ముఖ్య తారలుగా తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్‌ ‘వజ్రాలు కావాలా నాయనా’.

అనిల్‌ బూరగాని, నేహా దేశ్‌పాండే, నిఖితా బిస్థ్‌ ముఖ్య తారలుగా తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్‌ ‘వజ్రాలు కావాలా నాయనా’. పి. రాధాకృష్ణ దర్శకత్వంలో శ్రీపాద ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై కిషోర్‌ కుమార్‌ కోట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమా రంగంలోకి వచ్చా. అందులో భాగంగా కొందరు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాం.

నా కథకు దర్శకుడు పూర్తి న్యాయం చేశాడు. మంచి లొకేషన్స్ లో, భారీ సాంకేతిక విలువలతో రిచ్‌గా నిర్మించా. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుంది. జాన్  పొట్ల స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. మా చిత్రం పూర్తి వినోదంగా ఉందని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించడంతో సినిమాపై నమ్మకం మరింత పెరిగింది’’ అన్నారు. విజయ్‌ సాయి, చిట్టిబాబు, శివ, అశ్విని, కుందన నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.అమర్‌ కుమార్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: శివప్రసాద్‌ .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement