కౌండిన్య మూవీస్ పతాకంపై నటుడు, నిర్మాత తాళ్లపల్లి దామోదర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అనువంశికత’. సంతోష్ రాజ్, నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రమేష్ ముక్కెర దర్శకుడు. ఈ నెల 24న రిలీజ్‌కానున్న ఈ చిత్ర టైలర్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరకొండ మధుసూదనాచారి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా.. సందేశాత్మక చిత్రం తీసి రిలీజ్ చేయటం మామూలు విషయం కాదన్న మధుసూదనా చారి.. ఎంతో పట్టుదలగా సినిమాను పూర్తి చేసిన చిత్రయూనిట్‌ను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సుమన్ పైరసీ కారణంగా సినీ రంగం చాలా ఇబ్బంది పడుతుందని, ఇటీవల పలు చిత్రాల్లోని సన్నివేశాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో బయటకు రావటం బాధాకారమన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ... ‘నిర్మాత దాము గారు నాకు ఇష్టమైన వ్యక్తి. మేనరికాల వల్ల అంగవైకల్యంతో ఉండే పిల్లలు పుడతారు. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవలసి వస్తుందన్న అంశంతో పబ్లిక్‌ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ సినిమా రూపొందింది. దర్శకుడు చాలా బాగా డీల్ చేశారు. పాటలు కూడా బాగా కుదిరాయి. ఇలాంటి సినిమాకు ప్రభుత్వం పన్ను రాయితీ కల్పిస్తే బావుంటుంది. ఈ సినిమాను చదలవాడ శ్రీనివాసరావు గారు రిలీజ్ చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంద’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment