Anil buragani
-
వజ్రాలు కావాలా!
అనిల్ బూరగాని, నేహా దేశ్‌పాండే, నిఖితా బిస్థ్ ముఖ్య తారలుగా తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ ‘వజ్రాలు కావాలా నాయనా’. పి. రాధాకృష్ణ దర్శకత్వంలో శ్రీపాద ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై కిషోర్ కుమార్ కోట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమా రంగంలోకి వచ్చా. అందులో భాగంగా కొందరు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాం. నా కథకు దర్శకుడు పూర్తి న్యాయం చేశాడు. మంచి లొకేషన్స్ లో, భారీ సాంకేతిక విలువలతో రిచ్‌గా నిర్మించా. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుంది. జాన్ పొట్ల స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. మా చిత్రం పూర్తి వినోదంగా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించడంతో సినిమాపై నమ్మకం మరింత పెరిగింది’’ అన్నారు. విజయ్ సాయి, చిట్టిబాబు, శివ, అశ్విని, కుందన నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.అమర్ కుమార్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: శివప్రసాద్ . -
వజ్రాలు కావాలా?
అనిల్ బురగాని, నేహాదేశ్ పాండే, నిఖితా బిస్ట్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వజ్రాలు కావాలా నాయనా?’. పి.రాధాకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీపాద ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిశోర్ కుమార్ కోట నిర్మించారు. జాన్ పొట్ల స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరా బాద్‌లో విడుదల చేశారు. నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ బిగ్ సీడీ రిలీజ్ చేయగా, మరో నిర్మాత సాయి వెంకట్ పాటల సీడీ విడుదల చేసి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారా యణకు అందించారు. ‘‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక వీఎఫ్ఎక్స్లో చేరా. అప్పుడు కిషోర్ పరిచయమయ్యారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ, అడక్కుండానే నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారాయన. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీశాం’’ అని దర్శకుడు అన్నారు. విజయ్ సాయి, చిట్టిబాబు, కోట కిశోర్ కుమార్, ప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.అమర్ కుమార్.