
సమాజ శ్రేయస్సు కోసం...
అన్యాయాలను ఎదిరించి, సమాజ శ్రేయస్సు కోసం యువతరం ఏం చేశారనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ది బెల్స్’. రాహుల్, నేహా దేశ్‌పాండే జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ వాల్‌పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మూడు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈ నెల 5న చిత్రీకరణ మొదలుపెట్టి 16 లోపు ఈ మూడు పాటల చిత్రీకరణ పూర్తి చేస్తాం. కాసర్ల శ్యామ్ చక్కని స్వరాలందించారు. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.