జాగృతి కోసం... | The Bells Telugu Movie Opening | Sakshi
Sakshi News home page

జాగృతి కోసం...

Published Sun, Sep 28 2014 11:36 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

జాగృతి కోసం... - Sakshi

జాగృతి కోసం...

 సమకాలీన సమస్యల ఆధారంగా జగదాంబ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘ది బెల్స్’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ‘జాగృతి కోసం’ అనేది ఉపశీర్షిక. రాహుల్, నేహా దేశ్‌పాండే జంటగా నెల్లుట్ల ప్రవీణ్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పాలెం శ్రీకాంత్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ సలహాదారులు విద్యాసాగర్ రావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు అల్లాణి శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి, సమాజ శ్రేయస్సు కోసం యువతరం ఏం చేశారన్నదే ఈ చిత్రం కథాంశం’’ అని చెప్పారు. వచ్చే నెల 6న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, ఈ చిత్రంలో మంచి సందేశం ఉందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి రచన-మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: కాసర్ల శ్యామ్, కెమెరా: ఉదయ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement