Praveen Chander
-
సంతలో ప్రేమ
సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు జంటగా రూపొందుతోన్న చిత్రం ‘సంత’. ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అన్నది ట్యాగ్‌లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో శ్రీ జైవర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ– ‘‘ఓ సంత నేపథ్యంలో జరిగే ప్రేమకథా చిత్రమిది. ఫీల్‌గుడ్ ఎంటర్టైన్మెంట్. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. మిగిలిన టాకీ పార్ట్, పాటలను హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఫణీంద్ర వర్మ అల్లూరి, కథ– కథనం– సంగీతం– దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్. -
సమాజ శ్రేయస్సు కోసం...
అన్యాయాలను ఎదిరించి, సమాజ శ్రేయస్సు కోసం యువతరం ఏం చేశారనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ది బెల్స్’. రాహుల్, నేహా దేశ్‌పాండే జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ వాల్‌పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మూడు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈ నెల 5న చిత్రీకరణ మొదలుపెట్టి 16 లోపు ఈ మూడు పాటల చిత్రీకరణ పూర్తి చేస్తాం. కాసర్ల శ్యామ్ చక్కని స్వరాలందించారు. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.