
సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు
సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు జంటగా రూపొందుతోన్న చిత్రం ‘సంత’. ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అన్నది ట్యాగ్‌లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో శ్రీ జైవర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ– ‘‘ఓ సంత నేపథ్యంలో జరిగే ప్రేమకథా చిత్రమిది. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. మిగిలిన టాకీ పార్ట్, పాటలను హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఫణీంద్ర వర్మ అల్లూరి, కథ– కథనం– సంగీతం– దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్.
Comments
Please login to add a commentAdd a comment