మిస్సయిపోతానేమోనని ‘యస్‌’ చెప్పా | IPC Section Bharya Bandhu Back 2 Back Trailers | Sakshi
Sakshi News home page

మిస్సయిపోతానేమోనని ‘యస్‌’ చెప్పా

Published Mon, Jun 25 2018 1:22 AM | Last Updated on Mon, Jun 25 2018 1:22 AM

IPC Section Bharya Bandhu Back 2 Back Trailers - Sakshi

‘‘ఐపీసీ సెక్షన్‌ భార్యాబంధు’లో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌కి అడిగినప్పుడు చేయాలా? వద్దా? అనుకున్నా. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తున్నాను. ఈ సినిమాలో కొత్త హీరో. అయితే కథ విన్నాక ఒకవేళ చేయనని చెబితే మంచి సినిమా మిస్సయినట్లే అనిపించింది. అందుకే యస్‌ చెప్పా’’ అన్నారు ఆమని. ‘మిస్టర్‌ పెళ్లాం’, ‘శుభలగ్నం’ తదితర చిత్రాల్లో కథానాయికగా మంచి స్థానం సంపాదించుకున్న ఆమని ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కీలక పాత్రలు చేస్తున్న విఫయం తెలిసిందే. 

శరత్‌ చంద్ర, నేహా దేశ్‌ పాండే జంటగా రెట్టడి శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆలూరి క్రియేషన్స్‌ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మించిన ‘ఐపీసీ సెక్షన్‌ భార్యాబంధు’లో ఆమె ఓ కీలక పాత్ర చేశారు. ఈ నెల 29న చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఆమని మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నేను స్వాతీ శ్రీపాద అనే రైటర్‌ కమ్‌ కౌన్సిలర్‌గా చేశాను. ఇందులో నాకు పెళ్లి నేపథ్యంలో వచ్చే ఓ పాట కూడా ఉంది. ఇప్పటివరకూ వచ్చిన పెళ్లి పాటల్లో టాప్‌ టెన్‌లో ఈ పాట కూడా ఉంటుంది. వివాహ బంధం గొప్పతనం తెలియక చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. ఆ నేపథ్యంలో చక్కని సందేశం, మంచి వినోదంతో రెట్టడి శ్రీనివాస్‌ ఈ సినిమా తీశారు. ఎంతో ప్యాషన్‌తో ఆలూరి సాంబశివరావుగారు ఈ సినిమా నిర్మించారు. హీరో శరత్‌ చంద్రకు మంచి భవిష్యత్‌ ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement