అమ్మ గొప్పతనం | Aamani and Posani starrer Amma Deevena in its final schedule | Sakshi
Sakshi News home page

అమ్మ గొప్పతనం

Published Tue, May 14 2019 3:36 AM | Last Updated on Tue, May 14 2019 3:36 AM

Aamani and Posani starrer Amma Deevena in its final schedule - Sakshi

ఆమని

‘ఆడపిల్లలంటే అమ్మతో సమానం... అమ్మ బాగుంటే లోకమంతా బాగుంటుంది’ అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మ దీవెన’. ఆమని, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో శివ ఏటూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎత్తరి గురవయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ ఈ నెల 17నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా శివ ఏటూరి మాట్లాడుతూ– ‘‘అమ్మతోనే పుట్టుక ప్రారంభం.. అమ్మే సృష్టికి మూలం.. అమ్మ లేని లోకం చీకటిమయం అంటూ మాతృమూర్తుల గొప్పతనం తెలియజేసే చిత్రమిది. మా నిర్మాత గురవయ్య జీవితంలో జరిగిన కథ ఇది. ప్రతి తల్లి గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. మనుసును హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి. ఈ చిత్రాన్ని ప్రతి తల్లికి అంకితం ఇస్తున్నాం. ఆమని, పోసానిగారి నటన ఆకట్టుకుంటుంది. టాకీపార్ట్‌ పూర్తి అయింది. చివరి షెడ్యూల్‌లో పాటలు చిత్రీకరిస్తాం. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.వి.హెచ్, కెమెరా: సిద్ధం మనోహర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పవన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement