అమ్మ, నాయనమ్మలను చంపి.. కళ్లు పీకేశాడు! | mexican psychotic teenager stabs mother and granny, pluck their eyes | Sakshi

అమ్మ, నాయనమ్మలను చంపి.. కళ్లు పీకేశాడు!

Jun 3 2016 9:09 AM | Updated on Sep 4 2017 1:35 AM

అమ్మ, నాయనమ్మలను చంపి.. కళ్లు పీకేశాడు!

అమ్మ, నాయనమ్మలను చంపి.. కళ్లు పీకేశాడు!

మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోని ఓ కుర్రాడు.. తన తల్లిని, నాయనమ్మను పొడిచి చంపేసి.. వాళ్ల కనుగుడ్లు బయటకు పీకేశాడు.

మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోని ఓ కుర్రాడు.. తన తల్లిని, నాయనమ్మను పొడిచి చంపేసి.. వాళ్ల కనుగుడ్లు బయటకు పీకేశాడు. ఎందుకిలా చేశావని అడిగితే.. దెయ్యం తనను అలా చేయమందని చెప్పాడు. జీసస్ గ్వాడాలుపే మెడ్రానో అల్వరాడో (18) అనే ఈ కుర్రాడు తన తల్లి అమలాలియా పాలోమరెస్ అల్వరాడోను ఏకంగా 44 సార్లు పొడిచి పొడిచి మరీ చంపాడు. ఆ తర్వాత ఆమె కనుగుడ్లు బయటకు పీకేశాడు. సరిగ్గా అదే సమయంలో అతడి తండ్రి జేమీ మెడ్రానో గుటైరెజ్ (43) అక్కడకు వచ్చి అదంతా చూసి స్టన్ అయ్యారు.

అదే గదిలో చక్రాల కుర్చీలో ఉన్న నాయనమ్మను కూడా అల్వరాడో దారుణంగా పొడిచి చంపాడు. ఆమె చెవులు, కళ్లు కనిపించడం లేదు. ఆ తర్వాత కుర్రాడు తన తండ్రి మీద కూడా కత్తి దూశాడు. కొంతసేపు ఇద్దరూ పెనుగులాడారు. ఇంతలో పొ రుగువారు ఇంట్లోంచి వస్తున్న అరుపులు విని పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లొచ్చి విడదీశారు. కుర్రాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన గాడ్ ఫాదర్ ఇలా చేయమన్నాడని తొలుత చెప్పాడు.. ఎవరా గాడ్ ఫాదర్ అని గట్టిగా ప్రశ్నిస్తే, దెయ్యమని అన్నాడు. తన తల్లి, నాయనమ్మలను చంపి వాళ్ల కళ్లు తీసుకురమ్మని దెయ్యం తనకు చెప్పిందని అతడు సమాధానం ఇవ్వడంతో అంతా విస్తుపోయారు. ఈ దారుణ ఘటన ఈశాన్య మెక్సికన్ రాష్ట్రమైన టామౌలిపాస్‌లోని రియో బ్రావో నగరంలో జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement