![Psycho Rape Attempt On Woman And Her Sister In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/2/rape.jpg.webp?itok=iRHzlHiu)
నిందితుడు థామస్
దొడ్డబళ్లాపురం: తనను ప్రేమించలేదని కసి పెంచుకున్న యువకుడు ఉన్మాదిగా మారాడు. బాధిత యువతి తన చెల్లెలితో కలిసి ఆటోలో వెళ్తుండగా వాహనంతో ఢీకొని తర్వాత ఆ ఇద్దరిపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెళ్తంగడి తాలూకా గండిబాగిలు గ్రామం వద్ద చోటుచేసుకుంది. థామస్ అనే యువకుడు కొంతకాలంగా ఓ యువతి వెంటపడి తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. అయితే ఆ యువతి తిరస్కరిస్తూ వస్తోంది.
ఈక్రమంలో సదరు యువతి చెల్లెలతో కలిసి అణెయూరు నుంచి గండిబాగిలు గ్రామానికి ఆటోలో వెళ్తుండగా థామస్ గమనించాడు. తన పికప్ వాహనంలో కొంతదూరం వెంబడించాడు. ఆటో నిర్జనప్రదేశానికి చేరుకున్నాక వెనుక నుంచి ఢీకొట్టి బోల్తా కొట్టించాడు. ఈ సంఘటనతో ఆటో డ్రైవర్ నిశ్చేశ్టుడయ్యాడు. థామస్ ఒక్కసారిగా యువతిపై అత్యాచారానికి యత్నించాడు. అడ్డుకోబోయిన యువతి చెల్లెలిపై కూడా అత్యాచారానికి యత్నించాడు. ఎట్టకేలకు యువతి, ఆమె చెల్లెలు అతనిబారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు థామస్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment