కరీంనగర్: కరీంనగర్‌లో సోమవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కత్తి తీసుకుని ఎదురుగా వచ్చిన ఆటో డ్రైవర్ అంజయ్యపై దాడి చేశాడు. దీంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం సైకో రాళ్లతో ఆటోలపై దాడి చేయడంతో పది ఆటోలు ధ్వంసమయ్యాయి. దీంతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సైకో దాడితో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.