104 వాహనంపై దాడి.. అద్దాలు ధ్వంసం
చివ్వెంల: సైకో వీరంగం సృష్టించాడు. 104 వాహనంపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని వల్లభాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు కొద్ది నెలలుగా మతిస్థిమితం సరిగా లేక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడు.
ఈ క్రమంలో 2 నెలల క్రితం పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన నాగరాజు.. తిరిగి గ్రామస్తులపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరుస్తున్నాడు. సోమవారం గ్రామంలోకి వచ్చిన 104 వాహనంపై కర్రతోదాడి చేసి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సైకో వీరంగం
Published Tue, Mar 15 2016 1:10 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement