పశ్చిమ గోదావరి జిల్లాలో సైకో మళ్లీ రెచ్చిపోయాడు. తాజాగా బుధవారం పెనుగొండ మండలం సిద్ధాంతం, చెరుకువాడ గ్రామాల్లో ఇద్దరు మహిళలకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. ఆగంతకుని దాడిలో సిద్ధాంతంలో సూర్యకుమారి అనే మహిళ గాయపడింది. పిల్లలు.., పెద్దలు తేడా లేకుండా ఆడవాళ్లను కనిపిస్తే ఇంజక్షన్ గుచ్చుతున్నాడు. ద్విచక్ర వాహనంలో చక్కర్లు కొడుతూ ..రెప్పపాటులో సిరంజితో మందు ఎక్కించి మాయవుతున్నాడు.