injection attack
-
బాపట్లలో సూది సైకో వీరంగం.. విద్యార్థిపై దాడి
-
బాపట్లలో సూది సైకో వీరంగం.. విద్యార్థిపై దాడి
గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సైకో సూదిగాడు శనివారం గుంటూరు జిల్లాలో ప్రత్యక్షమైయ్యాడు. బాపట్లలో ఓ విద్యార్థిపై ఇంజక్షన్‌తో దాడి చేశాడు. శనివారం ఉదయం కృష్ణ అనే విద్యార్థి స్కూల్‌కి వెళ్తున్న సమయంలో... బైక్‌పై వచ్చిన ఆగంతకుడు అతడికి ఇంజక్షన్ గుచ్చి పరారైనట్టు తెలిసింది. బాధితుడు కృష్ణను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. సైకో సూదిగాడి దాడులతో మహిళలు, చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ ఘటనతో బాపట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అనంతలో సూదిగాడు కలకలం
అనంతపురం టౌన్: ఇంజక్షన్ సైకో దాడులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో సూదిగాడు సంచరిస్తున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. అనంతపురం పట్టణంలో ఇంజక్షన్ సైకో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. సూది పట్టుకుని సంచరిస్తున్న ఓ గుర్తుతెలియని ఇంజక్షన్ సైకో సురేష్ అనే వ్యక్తికి సూది గుచ్చి పరారయ్యాడు. గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పలుమార్లు ఇంజక్షన్ దాడులు జరుగుతున్న విషయం విదితమే. హైదరాబాద్ నగరంలో కూడా సూది సైకోలు సంచరిస్తూ, పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు . అనుమానిత వ్యక్తులను ఇంజక్షన్ దాడుల నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కొద్దిరోజుల నుంచి ఇరురాష్ట్రాల పోలీసులకు సైకో సూదిదాడులు పెను సవాళ్లుగా మారాయి. పోలీసులు, అధికారులు సైకోల దాడుపలై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంజక్షన్ దాడులు మాత్రం ఆగకపోవడం గమనార్హం. -
సైకో సూదిగాడు
-
మరోసారి సూదిపోటు కలకలం
సామర్లకోట(తూర్పుగోదావరి): సైకో సూదిపోటు మరోసారి కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గండం శ్రీనివాస్ అనే తాపీ మేస్త్రీ శుక్రవారం మధ్యాహ్నం పని ముగించుకుని బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఓ మహిళ, ఓ వ్యక్తి అకస్మాత్తుగా శ్రీనివాస్ వీపుపై సూది గుచ్చి వెళ్లిపోయారు. బాధితుడు స్థానిక ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
'పశ్చిమ'లో మళ్లీ రెచ్చిపోయిన సైకో
-
'పశ్చిమ'లో మళ్లీ రెచ్చిపోయిన సైకో
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో సైకో మళ్లీ రెచ్చిపోయాడు. తాజాగా బుధవారం పెనుగొండ మండలం సిద్ధాంతం, చెరుకువాడ గ్రామాల్లో ఇద్దరు మహిళలకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. ఆగంతకుని దాడిలో సిద్ధాంతంలో సూర్యకుమారి అనే మహిళ గాయపడింది. పిల్లలు.., పెద్దలు తేడా లేకుండా ఆడవాళ్లను కనిపిస్తే ఇంజక్షన్ గుచ్చుతున్నాడు. ద్విచక్ర వాహనంలో చక్కర్లు కొడుతూ ..రెప్పపాటులో సిరంజితో మందు ఎక్కించి మాయవుతున్నాడు. ఇంతకీ సైకో ఎందుకు ఆడవారిని టార్గెట్ చేస్తున్నాడు? ఏం మందు ఎక్కిస్తున్నాడన్నది మాత్రం పోలీసులకు సవాలుగా మారింది. ఈ నెల 22న ఉండి మండలంలో ఇద్దరు విద్యార్థులకు, నిన్న ఆరుగురు మహిళలకు ఈ ఆగంతకుడు ఇంజక్షన్లు చేశాడు. ప్రధానంగా మహిళలనే టార్గెట్ చేసుకుని అతడు ఈ ఘటనకు పాల్పడుతున్నాడు. ఆగంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.