
అనంతలో సూదిగాడు కలకలం
అనంతపురం టౌన్: ఇంజక్షన్ సైకో దాడులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో సూదిగాడు సంచరిస్తున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. అనంతపురం పట్టణంలో ఇంజక్షన్ సైకో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. సూది పట్టుకుని సంచరిస్తున్న ఓ గుర్తుతెలియని ఇంజక్షన్ సైకో సురేష్ అనే వ్యక్తికి సూది గుచ్చి పరారయ్యాడు. గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పలుమార్లు ఇంజక్షన్ దాడులు జరుగుతున్న విషయం విదితమే.
హైదరాబాద్ నగరంలో కూడా సూది సైకోలు సంచరిస్తూ, పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు . అనుమానిత వ్యక్తులను ఇంజక్షన్ దాడుల నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కొద్దిరోజుల నుంచి ఇరురాష్ట్రాల పోలీసులకు సైకో సూదిదాడులు పెను సవాళ్లుగా మారాయి. పోలీసులు, అధికారులు సైకోల దాడుపలై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంజక్షన్ దాడులు మాత్రం ఆగకపోవడం గమనార్హం.