injection psyco
-
అనంతలో సూదిగాడు కలకలం
అనంతపురం టౌన్: ఇంజక్షన్ సైకో దాడులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో సూదిగాడు సంచరిస్తున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. అనంతపురం పట్టణంలో ఇంజక్షన్ సైకో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. సూది పట్టుకుని సంచరిస్తున్న ఓ గుర్తుతెలియని ఇంజక్షన్ సైకో సురేష్ అనే వ్యక్తికి సూది గుచ్చి పరారయ్యాడు. గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పలుమార్లు ఇంజక్షన్ దాడులు జరుగుతున్న విషయం విదితమే. హైదరాబాద్ నగరంలో కూడా సూది సైకోలు సంచరిస్తూ, పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు . అనుమానిత వ్యక్తులను ఇంజక్షన్ దాడుల నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కొద్దిరోజుల నుంచి ఇరురాష్ట్రాల పోలీసులకు సైకో సూదిదాడులు పెను సవాళ్లుగా మారాయి. పోలీసులు, అధికారులు సైకోల దాడుపలై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంజక్షన్ దాడులు మాత్రం ఆగకపోవడం గమనార్హం. -
మరోసారి సూదిపోటు కలకలం
సామర్లకోట(తూర్పుగోదావరి): సైకో సూదిపోటు మరోసారి కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గండం శ్రీనివాస్ అనే తాపీ మేస్త్రీ శుక్రవారం మధ్యాహ్నం పని ముగించుకుని బైక్పై వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఓ మహిళ, ఓ వ్యక్తి అకస్మాత్తుగా శ్రీనివాస్ వీపుపై సూది గుచ్చి వెళ్లిపోయారు. బాధితుడు స్థానిక ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
సీసీ కెమెరాకు చిక్కిన ఇంజక్షన్ సైకో
ఏలూరు : ఉభయగోదావరి జిల్లాల పోలీసులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇంజక్షన్ సైకో కేసులో పురోగతి కనిపిస్తోంది. తమ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఇంజక్షన్ సైకోను గుర్తించామని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అంటున్నారు. బాధితులు పేర్కొన్న వివరాలను పోలిన ఓ వ్యక్తిని సీసీ కెమెరాలో గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ సహాయంతో ఇంజక్షన్ సైకో కోసం జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంజక్షన్ సైకోను పట్టుకోవడం కోసం 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. 49 చెక్ పోస్టుల వద్ద గట్టి భద్రత ఏర్పాటుచేశారు. 400 మంది పోలీసులు సైకో జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఇంజక్షన్ సైకో బ్లాక్ క్యాప్ ధరించి, బ్లాక్ హోండో షైన్ బైక్పై తిరుగుతున్నాడని జిల్లా పోలీసు యంత్రాంగం వెల్లడించింది. జిల్లాలోని భీమవరంలో పల్సర్ బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారం నాడు వెంబడించి ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదిలాఉండగా, ఇంజక్షన్ సైకో తెలంగాణలోని హైదరాబాద్, నల్లగొండ జిల్లా కోదాడలలో కూడా సంచరిస్తున్నట్లు పలు కథనాలు వచ్చిన విషయం విదితమే. -
వణుకు పుట్టిస్తున్న ఇంజక్షన్ సైకో