మరోసారి సూదిపోటు కలకలం | injection attack happened in east godavari district | Sakshi
Sakshi News home page

మరోసారి సూదిపోటు కలకలం

Published Fri, Sep 18 2015 3:27 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

injection attack happened in east godavari district

సామర్లకోట(తూర్పుగోదావరి): సైకో సూదిపోటు మరోసారి కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గండం శ్రీనివాస్ అనే తాపీ మేస్త్రీ శుక్రవారం మధ్యాహ్నం పని ముగించుకుని బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఓ మహిళ, ఓ వ్యక్తి అకస్మాత్తుగా శ్రీనివాస్ వీపుపై సూది గుచ్చి వెళ్లిపోయారు. బాధితుడు స్థానిక ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement