నల్గొండ జిల్లా రాజుపేట మండలం రేణిగుంట గ్రామంలో ఆదివారం ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడు.
రాజుపేట (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా రాజుపేట మండలం రేణిగుంట గ్రామంలో ఆదివారం ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడు. మహిళలపై దాడి చేయడమేకాక దుర్గమ్మ గుడిలోని పందిరికి నిప్పు పెట్టాడు. దాంతో పందిరి మొత్తం కాలిబూడిదైంది. గమనించిన స్థానికులు సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
రేణిగుంటకు చెందిన నల్ల భాస్కర్(18) అనే యువకుడు గత కొంతకాలంగా ఊరిలో అర్ధనగ్నంగా తిరుగుతూ మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రామస్తులు ఎన్నిసార్లు చితకబాదినా ప్రయోజనం లేదు. ఆదివారం ఉదయం కూడా ఊరిలో తిరుగుతూ వీరంగం సృష్టించాడు. చివరకు దుర్గమ్మ గుడి ప్రాంగణంలో వేసిన చలువ పందిరికి నిప్పుపెట్టాడు. ఫలితంగా పందిరి కాలిబూడిదైంది. ఆగ్రహించిన గ్రామస్తులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.