సైకో వీరంగం | Psycho halchal | Sakshi
Sakshi News home page

సైకో వీరంగం

Published Thu, May 11 2017 10:15 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

మహమ్మద్‌వలిని అదుపులోకి తీసుకుని తాళ్లతో కట్టేసిన దృశ్యం

మహమ్మద్‌వలిని అదుపులోకి తీసుకుని తాళ్లతో కట్టేసిన దృశ్యం

– కత్తి చేతపట్టుకుని, రాళ్లు విసురుతూ వీరంగం 
– నాలుగు గంటలపాటు ఉద్రిక్తత 
–  అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు 
 
చింతకుంట (ఆళ్లగడ్డ): నగర పంచాయతీ పరిధిలోని చింతకుంట గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గ్రామానికి చెందిన పుల్లిగాల్ల మహమ్మద్‌వలికి మానసిక స్థితి సరిగా లేదు. దీంతో గత కొంత కాలం క్రితం భార్య, పిల్లలు అతడిని వదిలి వెళ్లి పోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే గ్రామంలో తిరుగుతున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజాము నుంచి మహమ్మద్‌వలి మానసిక పరిస్థితి అదుపు తప్పి సైకోగా మారాడు. చేతిలో కత్తి పట్టుకుని వీధుల్లో తిరుగుతూ గ్రామస్తులపై రాళ్లు రువ్వుతూ, బూతులు తిడుతూ దాడి చేసెందుకు వెంట పడ్డాడు. ప్రజలు భయపడి ఇంటికి తలుపులు వేసుకున్నారు. పని మీద బయటకు వచ్చేందుకు కూడా భయపడ్డారు. ఈ క్రమంలో ఐదారు మందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని సైకోను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడికి యత్నించాడు. దాదాపు నాలుగు గంటల పాటు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సైకోను కోర్టు అనుమతితో మెంటల్‌ ఆసుపత్రికి తరలిస్తామని ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement