మంత్రి అచ్చెన్నాయుడే ఒక సైకో.. | former mla sairaj | Sakshi
Sakshi News home page

మంత్రి అచ్చెన్నాయుడే ఒక సైకో..

Published Tue, Sep 8 2015 12:03 AM | Last Updated on Wed, Aug 29 2018 7:50 PM

మంత్రి అచ్చెన్నాయుడే ఒక సైకో.. - Sakshi

మంత్రి అచ్చెన్నాయుడే ఒక సైకో..

ఇచ్చాపురం మాజీ ఎంఎల్‌ఎ సాయిరాజ్
 
 డాబాగార్డెన్స్: మంత్రి అచ్చెన్నాయుడు ఒక సైకో అని ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు సాయిరాజ్ విమర్శించారు. ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి విసిరిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి తన మంత్రి వర్గ సహచరుడు అచ్చెంనాయిడును సైకోలా తయారు చేసి ప్రతిపక్షనేత, ప్రతిపక్ష పార్టీపై దుర్భాషలాడాలని సూచించినట్టుందని వీరు పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గవర్నర్‌పై అసభ్య పదజాలంతో విమర్శల దాడికి దిగినప్పుడే అచ్చెన్నాయుడి సంస్కారం బయటపడిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో థర్మల్‌పవర్ ప్లాంట్, ఇసుక మాఫియా, ఇంకోవైపు రైతుల సమస్యలను పట్టించుకోకుండా సీఎం వద్ద మెప్పు పొందడానికి మంత్రి ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నేతపైనే దుర్భాషలాడుతూ సైకోలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

శ్రీకాకుళం జిల్లా ప్రజలపై మమకారం ఉంటే అక్కడి ప్రజలకు మెరుగైన సేవలందించి చంద్రబాబు వద్ద మెప్పు పొందాలని సూచించారు. మంత్రి పదవి నిలబెట్టుకోవడానికే ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష పార్టీపై ఇలాగే తీరు కొనసాగితే చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఏడేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న శివాజీయే అచ్చెంనాయిడును ఓ బచ్చా..అనలేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఆర్జించారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవిరెడ్డి పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement