తిరుమలలోని యాత్రీసదన్‌లో (ప్రయాణికుల ఉచిత వసతి సముదాయం) ఆదివారం ఉదయం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి భక్తులపై దాడికి పాల్పడ్డాడు. పలువురిపై చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భక్తుల రద్దీ భారీగా ఉంది. సర్వదర్శనం భక్తులకు స్వామి దర్శనానికి 15 గంటలు పడుతోంది. కాలిబాట భక్తులకు 10 గంటల సమయం తీసుకుంటోంది. ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు గంటల్లో పూర్తవుతోంది.