మెహదీపట్నం (హైదరాబాద్) : హైదరాబాద్ తపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో తాళ్లగడ్డలో శుక్రవారం మధ్యాహ్నం ఓ సైకో వీరంగం సృష్టించాడు. దారిన వెళుతున్న ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. షర్ట్ విప్పి నానా హంగామా సృష్టించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సదరు యువకుడి(30)ని అదుపులోకి తీసుకోబోగా... అతడు బ్లేడ్‌తో చేతి నరం దగ్గర కోసుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.