
శ్రుతీహాసన్, శింబు
శింబు, శ్రుతీహాసన్ జంటగా ఓ సినిమాలో నటించబోతున్నారా? అంటే, అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం రవితేజ సరసన ‘క్రాక్’, పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలు చేస్తున్నారు శ్రుతీహాసన్. తమిళంలో ‘లాభం’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా శింబు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ప్రస్తుతం శింబు ‘మహా’, ‘మానాడు’ అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నారని. ఇందులోనే శింబు సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటించనున్నారట. కరోనా కారణంగా షూటింగ్స్ పెద్దగా జరగడంలేదు. పరిస్థితులు అనుకూలంగా మారాక ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment