సిరిసిల్లలో ప్రారంభమైన బాలకృష్ణ సినిమా | Balakrishna and Gopichand Malineni film shoot starts | Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: సిరిసిల్లలో బాలకృష్ణ సినిమా షూటింగ్‌ షురూ

Published Sat, Feb 19 2022 4:47 AM | Last Updated on Sat, Feb 19 2022 8:01 AM

Balakrishna and Gopichand Malineni film shoot starts - Sakshi

బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని

యాక్షన్‌తో కొత్త సినిమాను ఆరంభించారు బాలకృష్ణ. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రధారులు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 18 (శుక్రవారం)న ప్రారంభమైంది. తెలంగాణలోని సిరిసిల్ల టౌన్‌ లొకేషన్స్‌లో చిత్రీకరణ ఆరంభించారు. ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌ కొరియోగ్రఫీ చేసిన ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారు బాలకృష్ణ. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషీ పంజాబీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement