నోరు మూసుకుని వెళ్లు అని స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఈ బ్యూటీకి ఇంతలా కోపం రావడం వెనక ఓ కారణం ఉంది. వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా నెటిజన్లతో చాట్ సెషన్ నిర్వహిస్తుంటారు శ్రుతీహాసన్. తాజాగా శ్రుతి నిర్వహించిన చాట్ సెషన్‌లో ‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అని ఓ నెటిజన్ అడిగాడు. ఈ ప్రశ్న శ్రుతికి కోపం తెప్పించింది. ‘‘ఈ రకమైన జాతి వివక్షను నేను అస్సలు సహించను.
మమ్మల్ని ఉద్దేశించి మీరు ఇడ్లీ, సాంబార్, దోసె అని పిలిస్తే ఊరుకోం. ఎలా పడితే అలా పిలిస్తే సరదాగా తీసుకోలేం. అలాగే మమ్మల్ని అనుకరించాలని మీరు ప్రయత్నించవద్దు. ఎందుకంటే.. మీరు మాలా చేయలేరు. సరే.. మీరు సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పమని అడిగారు కాబట్టి చెబుతున్నాను. ‘నోరు మూసుకుని వెళ్లు’’ అంటూ ఆ నెటిజన్‌కు రెస్పాండ్ అయ్యారు శ్రుతీహాసన్. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ‘డెకాయిట్: ఏ లవ్ స్టోరీ, చెన్నై స్టోరీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు శ్రుతీహాసన్.
Comments
Please login to add a commentAdd a comment