
ఆండ్రియా
తమిళ హీరోయిన్ ఆండ్రియా త్వరలోనే పిశాచిగా మారనున్నారట. దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘పిశాచి’. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధం చేస్తున్నారట ఆయన. ఇందులో లీడ్ రోల్‌లో ఆండ్రియా నటించనున్నారని సమాచారం. ఆమెది పిశాచి పాత్ర అని కోలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. విజయ్ నటించిన ‘మాస్టర్’లో ఓ కీలక పాత్ర చేశారు ఆండ్రియా. సూర్య హీరోగా ఆరంభం కానున్న ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తారామె.
Comments
Please login to add a commentAdd a comment