pisachi
-
పిశాచిగా మారతారా?
తమిళ హీరోయిన్ ఆండ్రియా త్వరలోనే పిశాచిగా మారనున్నారట. దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘పిశాచి’. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధం చేస్తున్నారట ఆయన. ఇందులో లీడ్ రోల్లో ఆండ్రియా నటించనున్నారని సమాచారం. ఆమెది పిశాచి పాత్ర అని కోలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. విజయ్ నటించిన ‘మాస్టర్’లో ఓ కీలక పాత్ర చేశారు ఆండ్రియా. సూర్య హీరోగా ఆరంభం కానున్న ఓ చిత్రంలో హీరోయిన్గా నటిస్తారామె. -
మళ్లీ వస్తున్నా..!
హీరోయన్ల పరిచయం చేయడానికి పెట్టింది పేరు మాలీవుడ్ అంటారు. అక్కడ నుంచి ఇతర భాషలకు తారలు విస్తరిస్తుంటారు. నయనతార లాంటి అగ్రతారల పుట్టినిల్లు మలయాళ సినిమానేనన్నది తెలిసిందే. అంతే కాదు దక్షిణాదిని చుట్టేస్తున్న యువ హీరోయిన్లలో చాలా మందికి కేరాఫ్ మాలీవుడ్డే. వీరంతా ఇతర భాషల్లో నటిస్తున్నా కోలీవుడ్‌ను ప్రత్యేకంగా చూస్తారు. తమిళ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతుంటారు. యువ నటి ప్రయాగ మార్టిన్ అదే కోరుకుంటున్నారు. పిశాచు చిత్రం పేరు చెబితే టక్కున గుర్తొచ్చే నటి ప్రయాగ. అదే ఈ మాలీవుడ్ అమ్మడికి తొలి తమిళ చిత్రం. ఆ తరువాత ఇక్కడ కనిపించకపోయినా మలయాళ, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. అయితే త్వరలో వరుస చిత్రాలతో కోలీవుడ్‌కు రానున్నట్లు ప్రయాగ చెప్పారు. ఈ అమ్మడు ఏమంటున్నారో చూద్దాం. హద్దులు లేని ప్రేమ, అభిమానాలు కలిగిన వారు ‘తమిళ ప్రజలు.. చాలా కాలం క్రితం పిశాచు చిత్రంలో నటించినా, ఇప్పటికీ నన్ను గుర్తించుకున్నారని తెలిసి చాలా భావోద్వేగానికి గురయ్యాను. అందుకు కారణం అయిన పిశాచు చిత్ర దర్శకుడు మిష్కిన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం మలయాళం, కన్నడం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను. మలయాళంలో సురేశ్‌గోపి వారసుడు గోకుల్ సురేశ్‌కు జంటగా ఉల్టా అనే చిత్రంలో నటించాను. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో తెరపైకి రానుంది. అదే విధంగా పృథ్వీరాజ్‌తో నటించిన బ్రదర్స్ డే చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం ఓనం పండగ సందర్భంగా తెరపైకి రానుంది. ఇకపోతే కన్నడంలో గోల్డెన్‌స్టార్ గణేశ్‌కుమార్ సరసన గీత అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది కన్నడ సినీ పరిశ్రమలో భారీ చిత్రంగా తెరకెక్కుతోంది. కోల్‌కతా, సిమ్లా, పంజాబ్, బెంగళూర్ వంటి సుందరమైన ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. నాకు తమిళ సినిమా అంటే ప్రత్యేక గౌరవం. కారణం ఒకటని చెప్పలేను. మంచి కథా చిత్రాలను అందించడంతో పాటు, తమ ఆత్మాభిమానానికి భంగం కలగకుండా, నేటివిటీని కోల్పోకుండా అంతర్జాతీయ స్థాయి చిత్రాలను అందించడం వరకూ తమిళసినిమా ప్రత్యేకం. అలాంటి కోలీవుడ్‌లో పలు వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం చాలా కథలు వింటున్నారు. త్వరలోనే వరుసగా నా చిత్రాల గురించి వివరాలు వెలువడనున్నాయి’ అని నటి ప్రయాగ మార్టిన్ చెప్పుకొచ్చారు. -
పిల్లలు, మహిళలు నా సినిమాలు చూడకండి
సినిమా ప్రమోషన్ సమయంలో ఏ డైరెక్టర్ అయినా మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రచారం చేసుకుంటారు. అయితే తమిళ దర్శకుడు మిస్కిన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన సినిమాను చిన్న పిల్లలు, మహిళలు చూడొద్దంటూ తానే ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల 'తర్కపు' అనే తమిళ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న మిస్కిన్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పిశాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మిస్కిన్, ఈ వ్యాఖ్యలతో సౌత్ ఇండస్ట్రీలో సంఛలనం సృష్టిస్తున్నాడు. సినిమా అంటేనే పెద్దలకోసం తీస్తారని, అలాంటి సినిమాలను కుటుంబ సమేతంగా చూడాలనుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు ఒకవేళ మీరు మీ పిల్లలతో కలిసి సినిమా చూడాలి అనుకుంటే ఏ యానిమేటెడ్ సినిమాకో లేక 'మై డియర్ కుట్టిచేతన్' లాంటి చిన్న పిల్లల సినిమాకో వెళ్లండి అంటూ ఘూటుగా స్పందించాడు. డైరెక్టర్ తాను అనుకున్న భావం తెర మీదకు రావటం కోసం కొన్నిసార్లు అసభ్యకరమైన పదాలు వాడక తప్పదని చెప్పాడు మిస్కిన్. తన తదుపరి చిత్రానికి సెన్సార్ బోర్డ్ తప్పకుండా 'ఏ' సర్టిఫికేట్ ఇస్తుందన్న మిస్కిన్... పిల్లలు, మహిళలు మాత్రం ఆ సినిమాను చూడొద్దన్నాడు. ఈ స్టేట్మెంట్ ఇవ్వటంలో మిస్కిన్ ధైర్యాన్నిమెచ్చుకున్నా, ప్రేక్షకుల్లో కేవలం ఒక వర్గం మాత్రమే చూస్తే సినిమా వసూళ్ల విషయంలో కష్టం అంటున్నారు సినీ జనాలు. -
సకుటుంబ... హారర్ చిత్రం
పేరుకు తగ్గట్టే ‘పిశాచి’ హారర్ సినిమా అయినా కుటుంబ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటోంది’’ అని చిత్రనిర్మాణ భాగస్వామి తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. సి. కల్యాణ్ నిర్మించగా, ఇటీవల విడుదలైన అనువాద చిత్రం ‘పిశాచి’ ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. సంగీత దర్శకుడు ఆరోల్ కొరెళి, ఛాయగ్రాహకుడు రవిరాయ్, సహనిర్మాత సీవీ రావు, బిఏ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఈ సినిమాలో మంచి దెయ్యం ఉంది!
- పూరి జగన్నాథ్ ‘‘మామూలుగా నేను దెయ్యం సినిమాలు చూడను. కానీ, ఈ చిత్రంలో మంచి దెయ్యం ఉందంటున్నారు. అందుకని చూడాలనుకుంటున్నా’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. మిస్కిన్ దర్శకత్వంలో దర్శకుడు బాల నిర్మించిన తమిళ చిత్రం ‘పిశాచి’ అదే పేరుతో తెలుగు తెరకు రానుంది. బాల సమర్పణలో ఈ చిత్రాన్ని సి. కల్యాణ్, కల్పన విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో నిర్మాతలు కేయస్ రామారావు, అశోక్‌కుమార్, సీవీ రావు, ఎగ్జిబిటర్ అలంకార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ఓ అందమైన దెయ్యం కథ ఇది. నిర్మాత శింగనమల రమేశ్ కుమారుడు హీరోగా నటించాడు. తమిళ ‘పిశాచి’ విడుదలైన రోజునే ఆమిర్‌ఖాన్ హిందీ చిత్రం ‘పీకే’ విడుదలైంది. హిందీ చిత్రం మీద అంచనాలతో మల్టీప్లెక్స్‌లో రోజుకి ఒక్క షో మాత్రమే ‘పిశాచి’కి ఇచ్చారు. మొదటి రోజే సినిమా బాగుందనే టాక్ రావడంతో వారం తిరిగేసరికి ఏడెనిమిది షోస్‌కి పెరిగింది. అది ఈ సినిమా స్థాయి. ఈ నెల 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘పిశాచి’ వస్తుంది’’ అన్నారు.