
సకుటుంబ... హారర్ చిత్రం
పేరుకు తగ్గట్టే ‘పిశాచి’ హారర్ సినిమా అయినా కుటుంబ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటోంది’’ అని చిత్రనిర్మాణ భాగస్వామి తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. సి. కల్యాణ్ నిర్మించగా, ఇటీవల విడుదలైన అనువాద చిత్రం ‘పిశాచి’ ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. సంగీత దర్శకుడు ఆరోల్ కొరెళి, ఛాయగ్రాహకుడు రవిరాయ్, సహనిర్మాత సీవీ రావు, బిఏ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.