ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దళిత బాలిక హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై అయోధ్యకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ఆయన గుక్కపెట్టి ఏడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పక్కనే కూర్చున్న మాజీ ఎంపీ పవన్ పాండే.. అవధేష్‌ను ఊరడిస్తూ కనిపించారు.
హత్యకు గురైన బాధిత దళిత బాలిక కుటుంబ సభ్యులను శనివారం అవధేష్ ప్రసాద్(Avadhesh Prasad) కలిశారు. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో అవధేష్ మాట్లాడుతూ ‘లోక్‌సభలో ప్రధాని మోదీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతాను. ఈ విషయంలో న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తాను. మన బిడ్డ గౌరవాన్ని కాపాడుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ఇది దేశంలో అత్యంత బాధాకరమైన ఘటన.
यह जघन्य अपराध बेहद दुःखद हैं।
अयोध्या के ग्रामसभा सहनवां, सरदार पटेल वार्ड में 3 दिन से गायब दलित परिवार की बेटी का शव निर्वस्त्र अवस्था में मिला है, उसकी दोनों आँखें फोड़ दी गई हैं उसके साथ अमानवीय व्यवहार हुआ है।
यह सरकार इंसाफ नही कर सकती। pic.twitter.com/aSvI3N74Kl— Awadhesh Prasad (@Awadheshprasad_) February 2, 2025
అయోధ్యలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక దళిత బాలికపై అత్యాచారం జరిపి, ఆపై దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నగ్న స్థితిలో కాలువలోకి విసిరేశారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది’ అని చెబుతూ అవధేష్ మీడియా ముందు గుక్కపెట్టి ఏడ్చారు. కాగా అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ అసెంబ్లీ స్థానా(Milkipur Assembly constituency)నికి ఫిబ్రవరి 5న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో అవధేష్ ప్రసాద్ కుమారుడు బరిలో ఉన్నారు. అటువంటి స్థితిలో అవధేష్ రోదిస్తున్న వీడియో వైరల్(Video goes viral) అయ్యింది. దీంతో అతని తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కిపూర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్టికానున్నాయి. మిల్కిపూర్ సీటును గెలుచుకునేందుకు అటు సమాజ్‌వాదీ పార్టీ, ఇటు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment